Share News

నాన్న నేర్పిన ఆ క్రమశిక్షణే నేను ఇప్పటికీ పాటిస్తున్నా..

ABN , Publish Date - Apr 12 , 2026 | 06:59 AM

వేసవి అంటేనే విహార యాత్రలు. సెలవుల్లో సన్నిహితులతో సంతోషంగా గడపడానికి... చల్లటి ప్రదేశాల్లో సేదదీరడానికి ప్రణాళికలు వేస్తుంటారు.

నాన్న నేర్పిన ఆ క్రమశిక్షణే నేను ఇప్పటికీ పాటిస్తున్నా..

  • విహారయాత్రల వినోదం

వేసవి అంటేనే విహార యాత్రలు. సెలవుల్లో సన్నిహితులతో సంతోషంగా గడపడానికి... చల్లటి ప్రదేశాల్లో సేదదీరడానికి ప్రణాళికలు వేస్తుంటారు. సెలబ్రిటీలైతే ఆ జోష్‌కు ఆకాశమే హద్దు. తారలు షూటింగ్‌లకు విరామం ఇచ్చి మరీ నచ్చిన చోటికి చెక్కేస్తుంటారు. ఇంతకీ మన తారల ఫేవరెట్‌ వెకేషన్‌ స్పాట్‌ ఏంటి? వారి మాటల్లోనే...

చిల్‌... స్విస్‌...

మా చిన్నప్పుడు నాన్నగారు ఎంత బిజీగా ఉన్నా, ఏడాదికి ఒకసారైనా మమ్మల్ని విదేశాలకు తీసుకెళ్లేవారు. అప్పట్లో సమ్మర్‌ వెకేషన్‌ అనేది మాకొక పెద్ద పండుగలా ఉండేది. నాన్న నేర్పిన ఆ క్రమశిక్షణే నేను ఇప్పటికీ పాటిస్తున్నా. నా పిల్లలకు ప్రపంచాన్ని చూపించడం, వారితో క్వాలిటీ టైమ్‌ స్పెండ్‌ చేయడం నా బాధ్యతగా భావిస్తా. అందుకే షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నా, సమ్మర్‌ వెకేషన్‌ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తా. చాలామంది అడుగుతుంటారు... మీకు స్విట్జర్లాండ్‌ అంటే ఎందుకు అంత ఇష్టం అని? మంచు కొండల మధ్య, చల్లని వాతావరణంలో నడుస్తుంటే కలిగే ప్రశాంతత మాటల్లో చెప్పలేను. ముఖ్యంగా సెయింట్‌ మోరిట్జ్‌లో నా పిల్లలు గౌతమ్‌, సితారలతో కలిసి స్కీయింగ్‌ చేయడం నాకు అత్యంత ఇష్టమైన వినోదం.

- మహేశ్‌బాబు


మాల్దీవులపైనే మనసంతా...

book1.2.jpgసమ్మర్‌ అంటే నాకు ఠక్కున గుర్తొచ్చేది మాల్దీవులు. అక్కడి సముద్రపు అలల చప్పుడు వింటూ, ఇసుకలో నడుస్తుంటే కలిగే హాయి వర్ణనాతీతం. నీలి సముద్రంలో ఈత కొడుతూ, సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ, స్థానిక వంటకాలను ఎంజాయ్‌ చేయడం... అదో గొప్ప అనుభూతి. మాల్దీవులు అంటే కేవలం ఒక వెకేషన్‌ స్పాట్‌ మాత్రమే కాదు, నాకొక హీలింగ్‌ స్పేస్‌. మొదట్లో నాకు నీళ్లంటే భయం ఉండేది, కానీ అక్కడ స్నార్కెలింగ్‌ చేయడం మొదలుపెట్టాక ఆ భయం పోయింది.

- అలియా భట్‌


ఫిజీకి ఫిదా...

book1.3.jpgఫిజీ ప్రకృతి రమణీయత... అక్కడి సంస్కృతి, రుచులు నన్ను మరో లోకంలోకి తీసుకెళ్తాయి. మామూలుగానే నాకు బీచ్‌లంటే ఇష్టం. ఫిజీలో ఆ ఆనందాన్ని తనివితీరా ఆస్వాదిస్తా. సమ్మర్‌ వెకేషన్‌కు అది పర్ఫెక్ట్‌ ప్లేస్‌. అక్కడ స్కూబా డైవింగ్‌, స్నార్కెలింగ్‌ వంటి సాహస క్రీడల్లో పాల్గొనడం చాలా ఇష్టం. నేను ఒంటరిగా ప్రయాణం చేసేరకం కాదు. సోలో ట్రావెల్‌ అంటే చాలా బోర్‌. నాతో పాటు వెంట ఎవరో ఒకరు ఉంటేనే వెకేషన్‌ ఎంజాయ్‌ చేయగలను. అందుకే ఎప్పుడూ ఫ్యామిలీతో లేదా బెస్ట్‌ ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్తా. అప్పుడు కూడా ఫిట్‌నెస్‌ రొటీన్‌ అస్సలు మిస్సవను.

- రకుల్‌ ప్రీత్‌సింగ్‌


న్యూయార్క్‌లో నచ్చినట్టుగా...

book1.4.jpgసమ్మర్‌ మొదలవ్వగానే నా మనసంతా న్యూయార్క్‌ చుట్టూ తిరుగుతుంటుంది. అదొక రంగుల ప్రపంచం. అక్కడ ప్రతీ వీధిలోనూ ఒక వైబ్‌ ఉంటుంది. దీపికతో కలిసి న్యూయార్క్‌ వీధుల్లో షాపింగ్‌ చేయడం, కొత్తరకం ఫ్యాషన్‌ ట్రై చేయడం ఇష్టం. ఫోన్లు పక్కన పెట్టేసి కేవలం మేమిద్దం సమయం తెలియకుండా గడిపేస్తాం. అక్కడ ఎవరూ మమ్మల్ని గుర్తుపట్టరు. మెచ్చిన చోటుకు వెళ్లి, నచ్చిన ఫుడ్‌ని ఎంజాయ్‌ చేస్తా. స్థానికులతో మాట్లాడతా. లైవ్‌ కన్సర్ట్‌ చూడాలంటే న్యూయార్క్‌కు మించిన చోటు లేదు. వెళ్లిన ప్రతీసారి కావాల్సినంత మానసిక ప్రశాంతత దొరుకుతుంది.

- రణ్‌వీర్‌ సింగ్


లండన్‌తో ఎన్నో జ్ఞాపకాలు...

book1.5.jpgచిన్నప్పుడు నాన్న (సైఫ్‌ అలీఖాన్‌), అమ్మ (అమృతాసింగ్‌) మమ్మల్ని ప్రతీ ఏటా వేసవి సెలవులకు లండన్‌ తీసుకెళ్లేవారు. సుమారు 45 రోజులపాటు అక్కడే ఎంజాయ్‌ చేసేవాళ్లం. ఇప్పటికీ లండన్‌ వెళ్తే ఆ పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అక్కడి హైడ్‌ పార్క్‌లో నడవడం, లోకల్‌ కెఫేల్లో కాఫీ తాగడం నాకు చాలా ఇష్టం. నేను ఎక్కడికెళ్లినా, ఎన్ని దేశాలు తిరిగినా... కశ్మీర్‌లోని ప్రశాంతత ఎక్కడా దొరకదు. అక్కడి ప్రకృతి సోయగాలను చూస్తుంటే, భూమి మీద స్వర్గం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. చాలామంది వేసవిలో బీచ్‌లకు వెళ్తారు, కానీ నాకు మాత్రం పర్వతాలంటేనే ప్రాణం. కొండల మధ్య ఉండే ఆ నిశ్శబ్దం నన్ను నేను కొత్తగా తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

- సారా అలీఖాన్‌


ఈ వార్తలు కూడా చదవండి:

పెరుగుతున్న పసిడి ధరలు.. స్థిరంగా వెండి!

ఇన్వెస్టర్లను భయపెట్టేందుకే ‘మావిగన్‌’: ఏబీవీ

Read Latest Telangana News and National News

Updated Date - Apr 12 , 2026 | 06:59 AM