Share News

పెరుగుతున్న పసిడి ధరలు.. స్థిరంగా వెండి!

ABN , Publish Date - Apr 12 , 2026 | 06:32 AM

భారత్‌లో గత రెండు మూడు రోజులుగా పసిడి ధరలు ఓ మోస్తరు స్థాయిలో పెరిగాయి. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. మరి హైదరాబాద్‌లో నేటి పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

పెరుగుతున్న పసిడి ధరలు.. స్థిరంగా వెండి!
Gold, Silver Rates on April 12

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలో ఓ మోస్తరు పెరుగుదల కనిపించింది. యూఎస్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ, డాలర్ బలహీనపడటం వంటివి బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ఆదివారం (ఏప్రిల్ 12) ఉదయం 6.30 సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,840గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,40,100గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.2.65 లక్షల వద్ద కొనసాగుతోంది.

గ్లోబల్ మార్కెట్స్‌ను కూడా పాజిటివ్ సెంటీమెంట్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర 4,738 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఔన్స్ వెండి 75 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కాల్పుల విరమణ నేపథ్యంలో కొంత సానుకూల సెంటీమెంట్ నెలకొన్నప్పటికీ ఇరు దేశాలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుండటంతో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


వివిధ నగరాల్లో 10 గ్రాముల బంగారం (24క్యారెట్లు, 22 క్యారెట్లు) ధరలు

  • చెన్నై: ₹1,53,820; ₹1,41,000

  • ముంబై: ₹1,52,840; ₹1,40,100

  • న్యూఢిల్లీ: ₹1,52,990; ₹1,40,250

  • కోల్‌కతా: ₹1,52,840; ₹1,40,100

  • బెంగళూరు: ₹1,52,840; ₹1,40,100

  • హైదరాబాద్: ₹1,52,840; ₹1,40,100

  • విజయవాడ: ₹1,52,840; ₹1,40,100

  • కేరళ: ₹1,52,840; ₹1,40,100

  • పుణె: ₹1,52,840; ₹1,40,100

  • వడోదరా: ₹1,52,890; ₹1,40,150

  • అహ్మదాబాద్: ₹1,52,890; ₹1,40,150

వెండి (కిలో) ధరలు ఇలా

  • చెన్నై: ₹2,65,000

  • ముంబై: ₹2,60,000

  • న్యూఢిల్లీ: ₹2,60,000

  • కోల్‌కతా: ₹2,60,000

  • బెంగళూరు: ₹2,60,000

  • హైదరాబాద్: ₹2,65,000

  • విజయవాడ: ₹2,65,000

  • కేరళ: ₹2,65,000

  • పుణె: ₹2,60,000

  • వడోదరా: ₹2,60,000

  • అహ్మదాబాద్: ₹2,60,000


ఈ వార్తలనూ చదవండి:

రిటైర్‌మెంట్ ప్లాన్.. ముందస్తు ప్రణాళికతోమలి వయసుకు భరోసా

ఎన్‌బీఎఫ్‌సీ-యూఎల్‌ వర్గీకరణకు ఆర్బీఐ కొత్త విధానం

Updated Date - Apr 12 , 2026 | 07:22 AM