రూ.లక్ష కోట్ల ఆస్తులు
ABN , Publish Date - Apr 11 , 2026 | 06:07 AM
దేశంలో ఎగువ శ్రేణి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎ్‌ఫసీ-యూఎల్) వర్గీకరణకు సంబంధించి ఆర్‌బీఐ సమూల మార్పులను ప్రతిపాదించింది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆస్తుల విలువ...
ఎగువ శ్రేణి ఎన్‌బీఎ్‌ఫసీల వర్గీకరణకు ఇక ఇదే గీటురాయి
సరళీకృత విధానాన్ని ప్రతిపాదించిన ఆర్‌బీఐ
ఇక ప్రభుత్వ ఎన్‌బీఎ్‌ఫసీలూ ఈ పరిధిలోకే..!
ముంబై: దేశంలో ఎగువ శ్రేణి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎ్‌ఫసీ-యూఎల్) వర్గీకరణకు సంబంధించి ఆర్‌బీఐ సమూల మార్పులను ప్రతిపాదించింది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆస్తుల విలువ, పారామెట్రిక్ స్కోరింగ్‌తో కూడిన రెండంచెల విధానానికి బదులు కేవలం ఆస్తుల విలువ ఆధారిత సరళీకృత విధానాన్ని సూచించింది. ఇందు కు సంబంఽధించిన సవరణల ముసాయిదాను శుక్రవారం జారీ చేసింది. ఇకపై రూ.లక్ష కోట్లు, అంతకు పైగా ఆస్తులు కలిగిన వాటిని అప్పర్ లేయర్ ఎన్‌బీఎ్‌ఫసీగా పరిగణించాలని ప్రతిపాదించింది. అంతేకాదు, అందరికీ ఒకే నియమావళి వర్తింపజేసేందుకు ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీ, ఐఆర్‌ఎ్‌ఫసీ వంటి ప్రభుత్వ ఎన్‌బీఎ్‌ఫసీలను సైతం ఈ విభాగంలో చేర్చాలని సిఫారసు చేసింది. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంలో ప్రభుత్వ ఎన్‌బీఎ్‌ఫసీలను అప్పర్ లేయర్ ఎన్‌బీఎ్‌ఫసీ వర్గీకరణ నుంచి మినహాయించారు. ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థలను బేస్ లేదా మిడిల్ లేయర్ ఎన్‌బీఎ్‌ఫసీ విభాగాల్లోనే చేర్చారు. మరిన్ని ముఖ్యాంశాలు..
అప్పర్ లేయర్ ఎన్‌బీఎ్‌ఫసీల గుర్తింపును నిర్ణీత కాలానికోసారి చేపట్టనున్నట్లు, రూ.లక్ష కోట్ల ఆస్తుల విలువ మదింపును ప్రతి ఐదేళ్లకో సారి సమీక్షించడం జరుగుతుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
అప్పర్ లేయర్ ఎన్‌బీఎ్‌ఫసీల వర్గీకరణకు కొత్త విధానానికి మారినప్పటికీ, వ్యవస్థాగతంగా కీలకమైన ఎన్‌బీఎ్‌ఫసీ గుర్తింపునకు మాత్రం పారామెట్రిక్ స్కోరింగ్ విధానాన్ని కొనసాగించనున్న ట్లు ఆర్‌బీఐ తెలిపింది.
అప్పర్ లేయర్ ఎన్‌బీఎ్‌ఫసీలకు ఎలాంటి పరిమితి లేకుండా ప్రభుత్వ గ్యారెంటీలను క్రెడిట్ రిస్క్ ట్రాన్స్‌ఫర్ సాధనాలుగా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది.
తాజా ప్రతిపాదనలపై వచ్చేనెల 4లోగా అభిప్రాయాలు తెలుపాలని ప్రజలు, సంబంధిత వర్గాలను రిజర్వ్ బ్యాంక్ కోరింది.
టాటా సన్స్‌కు లిస్టింగ్ తప్పదా..!?
టాటా గ్రూప్ కంపెనీల ప్రధాన వాటాదారు సంస్థ టాటా సన్స్ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అవుతుందా..? లేదా..? అని జోరుగా చర్చ సాగుతున్న తరుణంలో ఆర్‌బీఐ తాజా ప్రతిపాదనలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎందుకంటే, ఆర్‌బీఐ గతంలోనే (2022 సెప్టెంబరులోనే) టాటా సన్స్‌ను అప్పర్ లేయ ర్ ఎన్‌బీఎ్‌ఫసీల విభాగంలో చేర్చింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. ఈ విభాగంలోని టాప్-15 కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావ డం తప్పనిసరి. ఇందుకు గడువు 2025 అక్టోబరుతోనే ముగిసినా, టాటా సన్స్ మాత్రం ఇప్పటికీ లిస్ట్ కాలేదు. పైగా ఈ నిబంధన నుంచి తప్పించుకునేందుకు తన ఎన్‌బీఎ్‌ఫసీ లైసెన్సును కూడా రద్దు చేసుకుంది. ఆర్‌బీఐ కొత్త ప్రతిపాదనలతో పాటు టాటా సన్స్‌లో 18 శాతానికి పైగా వాటా కలిగిన షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ ఒత్తిడితో టాటా సన్స్ కూడా పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావాల్సి రావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాటా సన్స్ ప్రధాన వాటాదారైన టాటా ట్రస్ట్‌ల సీనియర్ ట్రస్టీ వేణు శ్రీనివాసన్‌తో పాటు మరో సభ్యుడు విజయ్ సింగ్ కూడా సంస్థను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాలని వాదిస్తుండటం గమనార్హం. కానీ, టాటా ట్రస్ట్‌ల చైర్మన్ నోయల్ టాటా మాత్రం ఇందుకు సుముఖంగా లేరు.
ఈ వార్తలూ చదవండి:
200 మిలియన్ డాలర్ల అమెరికన్ డ్రోన్ అదృశ్యం!
ఇజ్రాయెల్ ఆగ్రహం! పాక్ మంత్రి ట్వీట్‌ను డిలీట్ చేయించిన ఆర్మీ చీఫ్