Share News

స్నేహ ‘బంధం’... ఉత్సాహంగా...

ABN , Publish Date - Aug 02 , 2026 | 01:37 PM

స్నేహితుల దినోత్సవం అంటే... ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలు, హ్యాష్‌ట్యాగ్‌లు. కానీ ఒకప్పుడు... ఒక గ్రీటింగ్‌ కార్డ్‌ లేదా చిన్న దారంతో ముందు రోజు నుంచి స్నేహితుల కోసం ఎదురు చూపులుండేవి.

స్నేహ ‘బంధం’... ఉత్సాహంగా...
Friendship Day 2026

స్నేహితుల దినోత్సవం అంటే... ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలు, హ్యాష్‌ట్యాగ్‌లు. కానీ ఒకప్పుడు... ఒక గ్రీటింగ్‌ కార్డ్‌ లేదా చిన్న దారంతో ముందు రోజు నుంచి స్నేహితుల కోసం ఎదురు చూపులుండేవి. కార్డులు మాయమయ్యాయి. దారాలూ కనుమరుగయ్యాయి. టెక్నాలజీతో కొంత, కస్టమైజ్‌ చేసే బ్యాండ్స్‌తో ఇప్పుడు జెన్‌జీని సరికొత్త బ్యాండ్స్‌ ఆకర్షిస్తున్నాయి...

‘స్నేహమేరా జీవితం... స్నేహమేరా శాశ్వతం’ అంటూ ఒకతరం పాడుకుంటే, ‘ముస్తఫా.. ముస్తఫా’ , ‘ట్రెండు మారినా.. ఫ్రెండు మారడు..’ అంటోంది యువతరం. సాధారణంగా సోషల్‌ మీడియాలో పెట్టే కథనాలు ఇరవై నాలుగు గంటల్లోనే మాయమై పోతాయి. కానీ ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్లు రోజుల తరబడి స్నేహబంధాన్ని గుర్తుచేస్తాయి. స్ర్కీన్‌పై డబుల్‌ ట్యాప్‌ చేయడం కాకుండా... ఆత్మీయ స్పర్శతో ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్స్‌ స్నేహానికి పరిపూర్ణతను తీసుకొస్తాయి.


భళా అనిపించేలా...

చిన్నప్పుడు సాదా దారాలతో సరిపెట్టారు. రానురాను ప్లాస్టిక్‌ బ్యాండ్స్‌ ప్రాచుర్యంలోకి వచ్చాయి. అవే కాకుండా మార్కెట్‌లో చాలా రకాల బ్యాండ్స్‌ లభిస్తున్నాయి. అయితే ఓపికగా స్నేహితుడు/స్నేహితురాలి కోసం ఇంట్లోనే ప్రత్యేకంగా బ్యాండ్లను తయారుచేస్తే ఎలా ఉంటుంది? యూట్యూబ్‌ ఓపెన్‌ చేస్తే గంటలోనే స్నేహితులకు నచ్చిన విధంగా బ్యాండ్‌ తయారు చేయొచ్చు. రకరకాల పూసలు.. ఉలెన్‌ దారాలు చాలు. డ్రెస్‌లకు మ్యాచ్‌ అయ్యేలా.. లేదంటే మల్టీ కలర్‌ థ్రెడ్స్‌ ఉన్నవి అందరికీ నప్పుతాయి.


book11.jpgఅభిరుచికి తగ్గట్టుగా...

లెదర్‌ అంటే ఇష్టమున్నవారి కోసం ప్రత్యేకంగా లెదర్‌ ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్స్‌ ఎంచుకోవచ్చు. వాటికి మధ్యలో పేర్లు చేర్చొచ్చు. వీటిని కస్టమైజ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవేగాక ముక్కలైన హృదయాలు లేటెస్ట్‌ ట్రెండ్‌. ఒక హృదయపు ఫలకం మీద బెస్ట్‌ అని ఉంటే, మరొకదాని మీద ఫ్రెండ్‌ అని రాసి ఉంటుంది. ఇలాంటి బ్యాండ్స్‌ ఇద్దరు స్నేహితులు ఒక్క దగ్గర ఉన్నప్పుడు చూడముచ్చటగా కనిపిస్తాయి. దిష్టి తగలకుండా ఉండేలా కనిపించే ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్స్‌ కూడా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. రీసైకిల్‌ చేసిన ప్లాస్టిక్‌ కార్క్‌ లేదా ఆర్గానిక్‌ కాటన్‌ వంటి వాటితో కూడా బ్యాండ్స్‌ తయారవుతున్నాయి.


టెక్‌... సరికొత్త కిక్‌...

టెక్నాలజీని ఉపయోగించి కూడా ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్స్‌ని తయారుచేస్తున్నారు. వెలుగు జిలుగులతో నిండే బ్యాండ్లు అంటే ఎల్‌ఈడీ బ్యాండులు మార్కెట్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయి. వివిధ రంగుల్లో వెలిగిపోతాయి. ఇవేగాకుండా... మరింత ముందుకు వెళ్లి సరికొత్త బ్యాండ్స్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. అవే టెక్‌ బ్యాండ్స్‌. స్నేహితులు వేసుకున్న బ్యాండ్స్‌ రెండూ దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే అందులో వెలుగులు వస్తాయి. మరొక రకం ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్స్‌ ఎలాంటివంటే... ఒకరి ఫ్రెండ్‌ షిప్‌ బ్యాండ్‌ని టచ్‌ చేస్తే మరొకరికి వైబ్రేషన్‌ కలుగుతుంది. ప్రతీక్షణం పక్కన ఉన్నట్లే అనిపించేలాఈ బ్యాండ్‌ థ్రిల్‌ను కలిగిస్తుంది. స్నేహితులదినోత్సవాన్ని జోష్‌తో జరుపుకొనేందుకు ఇలాంటి థ్రిల్లింగ్‌ బ్యాండ్స్‌ ఎన్నో! ఆలస్య మెందుకూ... బ్యాండ్‌ బజాయించండి మరి!


ఈ వార్తలు కూడా చదవండి:

నల్లమలలో అపూర్వ శాసనాలు

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు కొత్త గేట్‌వే.. భోగాపురం!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 02 , 2026 | 01:45 PM