అమెరికాలో కాల్పుల ఘటన.. వైరల్‌గా మారిన రియల్ హీరో వీడియో..
ABN , Publish Date - Aug 02 , 2026 | 12:31 PM
అమెరికాలో ట్విన్ ఫాల్స్‌లోని రెస్టారెంట్‌లో కాల్పుల సందర్భంగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ధైర్య సాహసాలను ప్రదర్శించాడు. దుండగుడిని ఎదుర్కోవడానికి తాను కూడా తుపాకితో రంగంలోకి దిగాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికాలో ట్విన్ ఫాల్స్‌లోని రెస్టారెంట్‌లో కాల్పుల సందర్భంగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ధైర్య సాహసాలను ప్రదర్శించాడు. దుండగుడిని ఎదుర్కోవడానికి తాను కూడా తుపాకితో రంగంలోకి దిగాడు. సామాన్య ప్రజలపై కాల్పులు జరుపుతున్న దుండగుడిపై ఎదురు కాల్పులు జరిపాడు. ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల మేరకు.. దుండగుడు డ్రైవ్-థ్రూ ఏరియా వద్దకు వచ్చి కాల్పులు జరుపుతుండగా.. అక్కడ ఉన్న ఓ సాధారణ పౌరుడు తన వద్ద ఉన్న పిస్తోల్‌తో ఆ దుండగుడిపై ఎదురుకాల్పులు జరిపాడు.
ఆ గుర్తుతెలియని వ్యక్తి చూపిన ధైర్యం వల్లే పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. కారులో అటువైపుగా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఇందుకు సంబంధించిన దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో బంధించాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుండగుడికి ఎదురొడ్డి నిలబడ్డ ఆ వ్యక్తి ఎవరన్నది తెలియరాలేదు. సోషల్ మీడియాలో ఆ వ్యక్తిని రియల్ హీరో అంటూ నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.
దుండగుడి కాల్పుల్లో ముగ్గురి మృతి..
ఐడహో రాష్ట్రం, ట్విన్ ఫాల్స్ నగరంలో ఉన్న ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ 'ఇన్-ఎన్-అవుట్ బర్గర్'లో శనివారం మధ్యాహ్నం ఓ దుండగుడు దారుణానికి ఒడిగట్టాడు. ఏఆర్ స్టైల్ రైఫిల్, పిస్తోల్‌తో రెస్టారెంట్ లోపలికి వచ్చిన అతడు విచక్షణారహితంగా కస్టమర్లపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి నిందితుడు కూడా మరణించాడు. అయితే, అతను ఎదురుకాల్పుల్లో చనిపోయాడా లేదా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడా అన్నది తెలియరాలేదు.
ఇవి కూడా చదవండి
హార్దిక్ పాండ్య ట్రేడ్‌లో ట్విస్ట్.. సీఎస్కేతో చర్చలే లేవన్న ముంబై ఇండియన్స్
హనీ చిల్లీ ఆలూ.. ఇలా చేస్తే ఆ రుచే వేరుగా..