పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేయకపోతే ఆరోగ్యానికి ముప్పు..
ABN , Publish Date - Apr 14 , 2026 | 02:42 PM
నేటి కాలంలో పండ్లు, కూరగాయలపై పురుగుమందులు, రసాయనాలు ఉండే అవకాశం ఎక్కువ. అందుకే.. పండ్లు, కూరగాయలను బాగా శుభ్రం చేయడం చాలా అవసరం.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత కాలంలో వ్యవసాయంలో పురుగుమందులు, రసాయనాల వినియోగం ఎక్కువైంది. ఇవి మన శరీరంలోకి వెళ్లి ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. అందుకే పండ్లు, కూరగాయలను కేవలం నీటితో కడిగితే సరిపోదు, సరైన విధంగా శుభ్రం చేయడం చాలా అవసరం. లేదంటే ఈ రసాయనాలు శరీరంలోకి చేరి హార్మోన్ల అసమతుల్యత, అలర్జీలు, క్యాన్సర్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి పండ్లు, కూరగాయలను బాగా శుభ్రం చేసుకుని తినడం మంచిది.
పారుతున్న నీటిలో బాగా కడగడం:
ముందుగా పండ్లు, కూరగాయలను నీటిలో 2–5 నిమిషాలు నానబెట్టండి. తర్వాత కుళాయి నీటితో బాగా రుద్దుతూ కడగండి. ఇలా చేయడం వల్ల దుమ్ము, బ్యాక్టీరియా, కొంతవరకు పురుగుమందులు తొలగిపోతాయి.
ఉప్పు నీటిలో నానబెట్టడం:
నీటిలో 1–2 టీస్పూన్ల ఉప్పు వేసి పండ్లు, కూరగాయలను 10–15 నిమిషాలు నానబెట్టాలి. ఇది పైపొరపై ఉన్న రసాయనాలను తొలగించడంలో సహాయపడుతుంది. తర్వాత శుభ్రమైన నీటితో మళ్లీ కడగాలి.
బేకింగ్ సోడాతో క్లీన్ చేయడం:
ఒక లీటరు నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి, అందులో పండ్లు, కూరగాయలను 10–15 నిమిషాలు నానబెట్టాలి. ఇది రసాయనాలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
వెనిగర్ ఉపయోగించడం:
ఒక గిన్నె నీటిలో 1–2 టేబుల్ స్పూన్ల వెనిగర్ కలిపి, అందులో పండ్లు, కూరగాయలను 10 నిమిషాలు నానబెట్టాలి. ఇది బ్యాక్టీరియా, కొంతవరకు పురుగుమందులను తొలగిస్తుంది. కానీ ఎక్కువగా వాడితే రుచి మారే అవకాశం ఉంటుంది.
గోరువెచ్చని నీటిలో నానబెట్టడం:
పండ్లు, కూరగాయలను గోరువెచ్చని నీటిలో 10 నిమిషాలు నానబెట్టాలి. కావాలంటే కొద్దిగా ఉప్పు కలపొచ్చు. ఇలా చేయడం వల్ల ఉపరితలంపై ఉన్న రసాయనాలు తొలగిపోతాయి. పండ్లు, కూరగాయలను తినే ముందు ఈ జాగ్రత్తలు పాటిస్తే, వాటిపై ఉన్న హానికర రసాయనాలను చాలా వరకు తొలగిపోతాయి. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఈ అపోహలు నమ్మితే బరువు తగ్గడం కష్టం
సమ్మర్‌లో రోజూ షూ వేసుకుంటున్నారా?
For More Latest News