ఏకంగా 67 మంది యువతులను మోసం చేసిన కేటుగాడు..
ABN , Publish Date - Apr 14 , 2026 | 01:35 PM
పోలీస్ అధికారినంటూ యువతులను బురిడీ కొట్టిస్తున్న కేటుగాడిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్ఎఫ్ అధికారి వేషధారణలో తిరుగుతున్న నిందితుడు బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: పోలీస్ అధికారినంటూ యువతులను బురిడీ కొట్టిస్తున్న కేటుగాడిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్ఎఫ్ అధికారి వేషధారణలో తిరుగుతున్న నిందితుడు బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. సీఐఎస్ఎఫ్ దుస్తులు వేసుకుని విమానాశ్రయంలో హల్‌చల్ చేస్తుండగా అనుమానం వచ్చి పలు ప్రశ్నలు సంధించారు. పొంతనలేని సమాధానాలు చెబుతుండగా అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
అయితే, నిందితుడు చెప్పిన విషయాలు విని పోలీసులే షాక్ అయ్యారు. పెళ్లి కాని యువతులను వివాహం పేరుతో మోసం చేసేందుకే తాను పోలీస్ దుస్తులు వేసుకున్నట్లు చెప్పాడు. సీఐఎస్ఎఫ్ అధికారినంటూ ఇప్పటివరకూ 67 మంది మహిళలను బురిడీ కొట్టించినట్లు చెప్పడంతో పోలీసులే అవాక్కయ్యారు. మ్యాట్రిమొనీ డాట్‌కామ్‌లో పోలీస్ అధికారుల వేషంతో యువతులకు వల వేసినట్లు తెలిపాడు. అనంతరం వారిని మాటల్లో పెట్టి పలు రకాల మోసాలకు పాల్పడినట్లు వెల్లడించాడు. నిందితుడు బాలకృష్ణ శ్రీకాకుళం జిల్లా వాసిగా అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
అజ్ఞాతంలో నలుగురు మావోయిస్టులే ఉన్నారు: పోలీస్ శాఖ
ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె.. మనస్తాపంతో తల్లిదండ్రుల ఆత్మహత్య