Share News

అజ్ఞాతంలో నలుగురు మావోయిస్టులే ఉన్నారు: పోలీస్ శాఖ

ABN , Publish Date - Apr 14 , 2026 | 01:20 PM

తెలంగాణాకి చెందిన నలుగురు మావోయిస్టులు మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని రాష్ట్ర పోలీస్ శాఖ వెల్లడించింది. కేంద్ర కమిటీ సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియస్ గణపతి, పసునూరి అలియాస్ నరహరి అలియాస్ సంతోష్, స్టేట్ కమిటీ సభ్యులు జడే రత్నాబాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగు ఉన్నారని పోలీస్ శాఖ వివరించింది.

అజ్ఞాతంలో నలుగురు మావోయిస్టులే ఉన్నారు: పోలీస్ శాఖ

హైదరాబాద్, ఏప్రిల్ 14: తెలంగాణాకి చెందిన నలుగురు మావోయిస్టులు మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని రాష్ట్ర పోలీస్ శాఖ వెల్లడించింది. కేంద్ర కమిటీ సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియస్ గణపతి, పసునూరి అలియాస్ నరహరి అలియాస్ సంతోష్, స్టేట్ కమిటీ సభ్యులు జడే రత్నాబాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగు ఉన్నారని పోలీస్ శాఖ వివరించింది.

సాయుధ పోరాటం విరమించి.. జనజీవన స్రవంతిలో కలవాలంటూ ఇప్పటికే మావోయిస్టులకు డీజీపీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణా ప్రభుత్వ లొంగుబాటుతోపాటు పునరావాస విధానం ద్వారా లభించే ప్రయోజనాలు పొందాలను మావోయిస్టులకు పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసిన విషయం విదితమే.


మరోవైపు సోమవారం కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాల కూంబింగ్ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎల్ఓసీ కమాండర్ రూపీ రెడ్డి అలియాస్ రంగబోయిన భాగ్య (46) మరణించారు. సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం ఆమె స్వస్థలం. రెండు దశాబ్దాలుగా ఆమె అజ్ఞాతంలో ఉంటున్నారు.

మూడు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్‌గా రూపీ రెడ్డి ఉన్నారు. ఆమెపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. ఆమె మృతదేహానికి ఇప్పటికే పోస్ట్‌మార్టం పూర్తయింది. మంగళవారం సాయంత్రం ఈ మృతదేహం ఆమె స్వగ్రామానికి చేరుకోనుంది. బుధవారం రూపీ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తలుపులు తెరిచి ఉన్నాయి.. వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చు: కార్మికులకు మంత్రి సూచన

26 నుంచి చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు

For More TG News And Telugu News

Updated Date - Apr 14 , 2026 | 01:23 PM