Share News

సమ్మర్‌లో రోజూ షూ వేసుకుంటున్నారా? ఈ తప్పులు చేయకండి

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:15 PM

సమ్మర్‌లో రోజూ షూ వేసుకోవడం మంచిదేనా? దాని వల్ల పాదాల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఎలాంటి సమస్యలు వస్తాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సమ్మర్‌లో రోజూ షూ వేసుకుంటున్నారా? ఈ తప్పులు చేయకండి
Summer Footwear Mistakes

ఇంటర్నెట్ డెస్క్: వేసవి కాలంలో దుస్తులే కాకుండా పాదరక్షలను కూడా మార్చుకోవడం అవసరం. వేడి ఎక్కువగా ఉండే ఈ కాలంలో సౌకర్యంగా ఉండే చెప్పులు, షూలు ఎంచుకోవడం చాలా ముఖ్యం. కానీ చాలా మంది చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల పాదాల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. సరైన పాదరక్షలు ధరించకపోతే చెమట ఎక్కువగా పట్టడం, దుర్వాసన, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, అలర్జీల వంటి సమస్యలు రావచ్చు.


రోజంతా షూ ధరించడం

వేసవిలో రోజంతా షూ ధరించడం వల్ల చెమట ఎక్కువగా పట్టి దుర్వాసన, ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. అందుకే తేలికపాటి, మెష్ లేదా తోలు పదార్థంతో బూట్లను ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే రోజంతా మూసి ఉన్న షూలు ధరిస్తే పాదాలకు గాలి తగలదు, చెమట పేరుకుపోతుంది. దీంతో బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్లు రావడానికి అవకాశం ఉంటుంది.


సింథటిక్ పదార్థాల చెప్పులు వాడటం..

ప్లాస్టిక్ లేదా సింథటిక్ పదార్థాలతో చేసిన చెప్పులు గాలి సరిగా వెళ్లనివ్వవు. దీంతో చెమట లోపలే నిలిచి దుర్వాసన, ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. అలాగే, తడిగా ఉన్న లేదా చెమట పట్టిన చెప్పులను మళ్లీ ధరించడం మంచిది కాదు. ఇలా చేస్తే బ్యాక్టీరియా త్వరగా పెరిగి చర్మ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా, చాలా బిగుతుగా లేదా చాలా వదులుగా ఉన్న చెప్పులు ధరించడం వల్ల పాదాలకు గాయాలు, బొబ్బలు రావచ్చు. ఇవి తర్వాత ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. అలాగే, వేసవిలో పాదాలను శుభ్రంగా ఉంచడం చాలా అవసరం. రోజూ పాదాలను కడుక్కోకపోతే బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగి సమస్యలు వస్తాయి. అలాగే చెప్పులను కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

మనీ ప్లాంట్‌ ఈ దిశలో ఉంటే ఆర్థిక నష్టం

నేను బంతినే చూస్తా.. బౌలర్‌ను కాదు: వైభవ్ సూర్యవంశీ

For More Latest News

Updated Date - Apr 11 , 2026 | 12:15 PM