Share News

మనీ ప్లాంట్‌ ఈ దిశలో ఉంటే ఆర్థిక నష్టం

ABN , Publish Date - Apr 11 , 2026 | 11:34 AM

ఇళ్లలో మనీ ప్లాంట్ పెంచడం చాలా సాధారణం. ఇది గాలిని శుద్ధి చేయడమే కాకుండా ఇంటికి అందాన్ని కూడా ఇస్తుంది. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్‌ను సరైన దిశలో ఉంచకపోతే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

మనీ ప్లాంట్‌ ఈ దిశలో ఉంటే ఆర్థిక నష్టం
Money Plant Vastu Tips

ఇంటర్నెట్ డెస్క్: ఇళ్లలో చాలామంది మనీ ప్లాంట్ పెంచుకుంటారు. ఇది గాలిని శుద్ధి చేయడమే కాకుండా చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ఈ మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సరైన దిశలో పెడితే అదృష్టం, సంపద పెరుగుతాయని నమ్మకం.


ఏ దిశలో పెట్టాలి?

మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఆగ్నేయ దిశలో పెట్టడం మంచిది. ఇది గణేశుడి దిశ, కాబట్టి ఇక్కడ పెట్టడం వల్ల ఆర్థిక అడ్డంకులు తొలగిపోయి, సంపద, అదృష్టం పెరుగుతాయని నమ్ముతారు. ఈ దిశలో ఉంచితే ఆర్థికంగా లాభాలు వస్తాయని, ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని అంటారు.


ఏ దిశలో పెట్టకూడదు?

మనీ ప్లాంట్‌ను ఈశాన్య దిశలో అస్సలు పెట్టకూడదు. ఈ దిశలో ఉంచితే ఆర్థిక నష్టం, ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మనీ ప్లాంట్‌ తీగలు నేలను తాకకుండా చూడాలి. ఎండిన లేదా పసుపు ఆకులను వెంటనే తీసేయాలి. మొక్క ఎండిపోతే అది మంచిది కాదని వాస్తు చెబుతుంది. కాబట్టి, మనీ ప్లాంట్‌ మొక్కకు నీరు పోస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి.


బహుమతిగా ఇవ్వకూడదు

అలాగే, మనీ ప్లాంట్‌ను ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదని కూడా కొందరు నమ్ముతారు. మనీ ప్లాంట్‌ను సరైన దిశలో, సరైన విధంగా పెంచితే ఇంట్లో సానుకూలత, శుభం, ఆర్థిక అభివృద్ధి పెరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

పద్మాసనంలో ఎక్కువసేపు కూర్చోవడం మంచిదేనా?

హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ పొరపాట్లు చేస్తే ప్రయోజనం ఉండదు

For More Latest News

Updated Date - Apr 11 , 2026 | 12:16 PM