బెస్ట్ సమ్మర్ డ్రింక్ .. ఇంట్లోనే బాదం పాలు ఎలా తయారు చేయాలంటే..
ABN , Publish Date - Apr 10 , 2026 | 02:11 PM
వేసవిలో శరీరాన్ని చల్లగా, హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ సీజన్‌లో సహజమైన పానీయాలు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ తగ్గి శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
ఇంటర్నెట్ డెస్క్: సమ్మర్‌లో బాదం పాలు ఒక ఆరోగ్యకరమైన సహజ పానీయం. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా అనేక పోషక ప్రయోజనాలను అందిస్తుంది. బాదం పాలు వేసవిలో వేడి ప్రభావాన్ని తగ్గిస్తుంది. బాదంలో ఉండే ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి శక్తిని అందిస్తాయి. విటమిన్ E ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది. బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి, ఎముకల బలానికి, చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఇంట్లో బాదం పాలు ఎలా తయారు చేయాలి?
కావలసిన పదార్థాలు:
బాదం గింజలు – 1 కప్పు
పాలు 2 కప్పులు
పంచదార 1/2 కప్పు (రుచికి తగినంత)
యాలకుల పొడి 1/2 టీస్పూన్
పిస్తా/జీడిపప్పు: 4-5 (సన్నగా తరిగినవి, గార్నిషింగ్ కోసం)
తయారీ విధానం:
ముందుగా బాదంపప్పును అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. తర్వాత వాటి తొక్క తీసి శుభ్రం చేయాలి. ఆ తర్వాత నానబెట్టిన బాదంను కొద్దిగా పాలతో కలిపి మిక్సీలో వేసి పేస్ట్‌గా తయారు చేసుకోవాలి. తర్వాత స్టవ్‌పై ఒక పాన్ పెట్టి మిగిలిన పాలు వేడి చేయాలి. పాలు వేడెక్కిన తర్వాత అందులో బాదం పేస్ట్ వేసి బాగా కలపాలి. కాసేపు అయ్యాక ఇందులో పంచదార, యాలకుల పొడి వేసి మరోసారి కలపాలి. మీకు ఇష్టమైతే గార్నిషింగ్ కోసం పిస్తా/జీడిపప్పు వేసుకోవచ్చు. సుమారు 5 నిమిషాలు మంట తక్కువగా పెట్టి మరిగించాలి. తయారైన బాదం పాలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచి, పూర్తిగా చల్లబరచి తాగడం చాలా మంచిది. వేసవి కాలంలో ఈ చల్లటి పానీయం శరీరాన్ని చల్లబరిచి, ఉపశమనాన్ని ఇస్తుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
వేసవిలో స్కిన్ కేర్ సీక్రెట్స్.. టాన్ తగ్గించడానికి ఇంటి చిట్కాలు
సమ్మర్ ట్రిప్‌కు వెళ్తున్నారా? ఈ వస్తువులు మిస్ అవ్వొద్దు
For More Latest News