Share News

వేసవిలో స్కిన్ కేర్ సీక్రెట్స్.. టాన్ తగ్గించడానికి ఇంటి చిట్కాలు

ABN , Publish Date - Apr 10 , 2026 | 01:11 PM

వేసవిలో టానింగ్ సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. మార్కెట్లో ఉన్న ఖరీదైన ఉత్పత్తుల కంటే ఇంట్లోనే లభించే సహజ పదార్థాలతో ఈ సమస్యకు సులభంగా పరిష్కారం పొందవచ్చు.

వేసవిలో స్కిన్ కేర్ సీక్రెట్స్.. టాన్ తగ్గించడానికి ఇంటి చిట్కాలు
Sun Tan Removal Face Masks

ఇంటర్నెట్ డెస్క్: వేసవిలో ఎండ కారణంగా చర్మం నల్లబడటం లేదా టానింగ్‌ రావడం చాలా మందికి సాధారణ సమస్య. దీన్ని తగ్గించడానికి ఖరీదైన క్రీములు అవసరం లేదు. మన ఇంట్లోనే ఉన్న సహజ పదార్థాలతో టాన్‌ను తగ్గించుకోవచ్చు. ఈ ఇంటి చిట్కాలు చర్మానికి ఉపశమనం కలిగించి, సహజమైన మెరుపును అందిస్తాయి.


శనగపిండి ఫేస్ ప్యాక్

శనగపిండి చర్మంపై ఉన్న మలినాలను తొలగించి టాన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మృత కణాలను తీసివేసి చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. 2 టీస్పూన్ల శనగపిండి, 2 టీస్పూన్ల పాలు, చిటికెడు పసుపు కలిపి పేస్ట్ తయారు చేయాలి. ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

పెరుగు- పసుపు ఫేస్ ప్యాక్

పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. 2 టేబుల్ స్పూన్ల పెరుగు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి రాయాలి. 15 నిమిషాల తర్వాత ఫేస్‌వాష్ చేసుకోవాలి.

Sun Tan Removal Face Masks


టమోటా- తేనె ఫేస్ ప్యాక్

టమోటా సహజంగా టాన్ తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. 2 టీస్పూన్ల టమోటా రసం, 1 టీస్పూన్ తేనె కలిపి ముఖానికి రాసి 10–15 నిమిషాలు ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో కడగాలి.

కలబంద- నిమ్మకాయ ఫేస్ ప్యాక్

కలబంద చర్మానికి చల్లదనం ఇస్తుంది, నిమ్మకాయ టాన్ తగ్గించడంలో సహాయపడుతుంది. 2 టీస్పూన్ల కలబంద జెల్, అర టీస్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడగాలి. ఈ సహజమైన ఇంటి ఫేస్ మాస్క్‌లను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే టాన్ తగ్గి చర్మం సహజంగా మెరుస్తుంది. వేసవిలో ఇలా సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు

For More Latest News

Updated Date - Apr 10 , 2026 | 01:16 PM