ఆకులే కాదు.. మునగ తొక్కల్లో కూడా పోషకాలే!
ABN , Publish Date - Apr 20 , 2026 | 03:36 PM
చాలా మంది మునగ తొక్కలను పారేస్తారు. అయితే ఈ తొక్కల్లో కూడా అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మునగ తొక్కలు ఎలాంటి ప్రయోజనాలు ఇస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: మునగ ఆకులే కాకుండా, దాని తొక్కల్లో కూడా అనేక పోషకాలు దాగి ఉన్నాయని చాలా మందికి తెలియదు. సాధారణంగా వంటలో మునగ తొక్కలను పారేస్తాం కానీ అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి చర్మ సంరక్షణ వరకు మునగ తొక్కలు ఉపయోగపడతాయని అంటున్నారు.
పొడి తయారు చేయడం
మునగ తొక్కలను శుభ్రంగా కడిగి ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని సూప్‌లు, పప్పులు వంటి వాటిలో కలపవచ్చు. ఇది ఆహారానికి అదనపు పోషకాలు అందిస్తుంది.
మునగ టీ
మునగ తొక్కలను నీటిలో మరిగించి టీలా తాగవచ్చు. దీనికి కొద్దిగా దాల్చినచెక్క కలిపితే మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
ముఖానికి ఉపయోగించడం
మునగ తొక్కల పొడిని పెరుగు, తేనెతో కలిపి ముఖానికి పట్టించవచ్చు. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా చేసి, మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది.
మొక్కల ఎరువుగా ఉపయోగించడం
మునగ తొక్కలను కంపోస్ట్‌గా ఉపయోగించవచ్చు. మట్టి పొరల మధ్య వీటిని వేసి సహజ ఎరువుగా తయారు చేస్తే మొక్కలు బాగా పెరుగుతాయి. మునగ తొక్కలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనవి. వాటిని పారేయకుండా సరైన విధంగా ఉపయోగించుకుంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!
ప్రకృతి ప్రసాదించిన యాంటీ బయాటిక్స్.. రోగనిరోధక శక్తిని పెంచే 'సూపర్ మసాలాలు' ఇవే!
For More Latest News