Share News

త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటాం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్..

ABN , Publish Date - Apr 20 , 2026 | 03:17 PM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతాయని వార్తలు వస్తున్నప్పటికీ, తాజా పరిణామాలు మాత్రం ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఇరాన్‌ జెండాతో ఉన్న వాణిజ్య నౌక తౌస్కాను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటాం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్..
US Iran war

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతాయని వార్తలు వస్తున్నప్పటికీ, తాజా పరిణామాలు మాత్రం ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఇరాన్‌ జెండాతో ఉన్న వాణిజ్య నౌక తౌస్కాను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. నౌకపై తొలుత కాల్పులు జరిపి ఆపై అదుపులోకి తీసుకున్నాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఈ ఘటన జరిగింది. ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకున్నామని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు (Iran ship seized).


అమెరికా తన నౌకను స్వాధీనం చేసుకోవడంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యను ఇరాన్‌పై దాడిగా భావిస్తూ త్వరలోనే ప్రతీకారం తీసుకుంటామని హెచ్చరించింది. అమెరికా చేసిన ఈ పని వల్ల యుద్ధాన్ని ఆపేందుకు జరుగుతున్న చర్చలు కూడా సంక్షోభంలో పడిపోయాయి. అమెరికా చర్యలను కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనగా ఇరాన్ భావిస్తోంది. రెండో దఫా శాంతి చర్చలకు ఆసక్తి చూపడం లేదు (Strait of Hormuz crisis).


దౌత్య చర్చల విషయంలో అమెరికా నిజాయతీగా వ్యవహరించడం లేదని, యుద్ధాన్ని ఆపాలనే విషయంలో ఆ దేశానికి చిత్తశుద్ధి లేదని ఇరాన్ వ్యాఖ్యానించింది (US Iran war). కాగా, ఇరాన్ నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడాన్ని చైనా కూడా ఖండించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరు పక్షాలు గౌరవించాలని సూచించింది.


ఇవి కూడా చదవండి..

పీక్స్‌కు హోర్ముజ్ ఉద్రిక్తతలు! ఇరాన్‌ నౌకను సీజ్ చేసిన యూఎస్

అన్న క్యాంటీన్‌లో అల్పాహారం తీసుకున్న చంద్రబాబు దంపతులు

Updated Date - Apr 20 , 2026 | 03:50 PM