అన్న క్యాంటీన్‌లో అల్పాహారం తీసుకున్న చంద్రబాబు దంపతులు
ABN , Publish Date - Apr 20 , 2026 | 10:06 AM
సీఎం చంద్రబాబు నాయుడు తన 76వ పుట్టినరోజు సందర్భంగా భార్య నారా భువనేశ్వరతో కలిసి విజయవాడలోని పటమట ప్రాంతంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి అన్న క్యాంటీన్‌లో అల్పాహారం తీసుకున్నారు.
విజయవాడ, ఏప్రిల్ 20: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) తన 76వ పుట్టినరోజు సందర్భంగా భార్య నారా భువనేశ్వరతో కలిసి విజయవాడలోని పటమట ప్రాంతంలో ఉన్న ‘అన్న క్యాంటీన్’కు చేరుకున్నారు. సీఎం దంపతులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్వాగతం పలికారు. పేదలు, కార్మికులు, ప్రజల మధ్య తన జన్మదినాన్ని సీఎం సాదాసీదాగా జరుపుకున్నారు. చంద్రబాబుకు అన్న క్యాంటీన్ లబ్ధిదారులు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి దంపతులు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అల్పాహారాన్ని వడ్డించారు. ఆపై ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి అన్న క్యాంటీన్‌లో అల్పాహారం తీసుకున్నారు. సాధారణ ప్రజల మధ్య కూర్చొని అల్పాహారం స్వీకరించారు చంద్రబాబు దంపతులు. అన్న క్యాంటీన్ లబ్ధిదారులతో సీఎం మాటామంతి నిర్వహించారు.
నారా భువనేశ్వరి తన భర్త చంద్రబాబు 76వ పుట్టినరోజు కానుకగా 76 లక్షల రూపాయలు అన్న క్యాంటీన్ నిర్వాహకులకు విరాళంగా అందజేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తంతో నేడు 269 అన్న క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం అన్నీ పూర్తి ఉచితంగా అందించాలని ఆదేశించారు. పటమట అన్న క్యాంటీన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హ్యాపీ బర్త్ డే సీఎం సర్ అంటూ నినాదాలు చేశారు. వారందరికీ ఆత్మీయంగా అభివాదం చేశారు ముఖ్యమంత్రి.
ఇవి కూడా చదవండి..
సీఎం చంద్రబాబు జన్మదినం.. వెల్లువెత్తిన శుభాకాంక్షలు
పీక్స్‌కు హోర్ముజ్ ఉద్రిక్తతలు! ఇరాన్ నౌకను సీజ్ చేసిన యూఎస్
Read Latest AP News And Telugu News