Share News

మీ బైక్ మైలేజీ తగ్గుతోందా..? అయితే ఈ తప్పులు చేయకండి!

ABN , Publish Date - Sep 29 , 2026 | 03:44 PM

మీ బైక్ మైలేజీ తగ్గుతున్నట్టు అనిపిస్తోందా..? అయితే ఈ కథనం మీకోసమే..

మీ బైక్ మైలేజీ తగ్గుతోందా..? అయితే ఈ తప్పులు చేయకండి!
Bike mileage tips

ఇంటర్నెట్ డెస్క్: బైక్ మైలేజీ అనేది ఇంజిన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కాని మైలేజీ తగ్గడానికి అన్నివేళలా ఇంజిన్‌లో లోపాలే కారణం కాకపోవచ్చు. బైక్ నడిపేటప్పుడు చేసే చిన్న చిన్న తప్పులు కూడా మైలేజీపై ప్రభావం చూపుతాయి. ఈ తప్పులు వల్ల పెట్రోల్ వినియోగం పెరగొచ్చు. ఫలితంగా బైక్ మైలేజీ క్రమంగా తగ్గుతుంది. అందుకే ఈ తప్పులేంటో తెలుసుకుందాం రండి!


మొదటి తప్పు

  • బైక్ టైర్లలో గాలి తక్కువ ఉన్నా కొందరు పట్టించుకోరు. అయితే దీనివల్ల మైలేజీని తగ్గే అవకాశాలున్నాయి.

  • గాలి తక్కువగా ఉండడం వల్ల టైరు రోలింగ్ నిరోధకత (Rolling Resistance) పెరుగుతుంది.

  • ఇలాంటి పరిస్థితుల్లో బైక్‌ను నడపడానికి ఇంజిన్ ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.

  • కాబట్టి కంపెనీ నిర్దేశించిన స్థాయిలో టైర్ ప్రెషర్ ఉండేలా చూసుకోవాలి


రెండో తప్పు

  • అధిక గేర్‌ వేసి, తక్కువ వేగంతో వాహనాన్ని నడిపితే.. ఇంజిన్ పై ఒత్తిడి పడుతుంది.

  • అదే సమయంలో తక్కువ గేర్‌లో ఎక్కువ సేపు బైక్ డ్రైవ్ చేసినా ఇంధన వినియోగం పెరుగుతుంది.

  • అందుకే వేగం, రహదారులకు అనుగుణంగా గేర్‌ను ఎంచుకోవాలి


మూడో తప్పు

  • పదేపదే వేగంగా యాక్సిలరేషన్ చేయడం వల్ల పెట్రోల్ వినియోగం పెరుగుతుంది.

  • అలాగే ట్రాఫిక్‌లో యాక్సిలరేట్ చేస్తూ, బ్రేకులు వేస్తున్న సమయంలోనూ ఇంజిన్ ఎక్కువ ఇంధనాన్ని వాడుకుంటుంది.

  • అందుకే యాక్సిలరేషన్ ప్రక్రియను సున్నితంగా చేయడం మంచిది


నాలుగో తప్పు

  • చాలా మంది బైక్‌లకు సకాలంలో సర్వీసింగ్ చేయించరు. ఇది కూడా మైలేజీపై ప్రభావం చూపుతుంది

  • వాహనానికి క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించడం ముఖ్యమని గుర్తించాలి

  • సర్వీసింగ్ ప్రక్రియలో ఇంజిన్ ఆయిల్ మారుస్తారు. ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్‌లను తనిఖీ చేస్తారు. అందుకే క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలి.


ఇవీ చదవండి

ఆరోగ్యకరమైన అరికెల జావ.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేసుకోండి

డాక్టర్ కంటే ముందు గూగుల్.. అనారోగ్యంగా అనిపిస్తే మొదట ఏఐని సంప్రదిస్తున్న ప్రజలు

Updated Date - Sep 29 , 2026 | 03:44 PM