Share News

ఉక్రెయిన్ వార్‌కు మోదీ వద్ద పరిష్కారం: రష్యా అధ్యక్షుడు పుతిన్

ABN , Publish Date - Oct 02 , 2026 | 09:58 AM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు. ఉక్రెయిన్‌తో తాము చేస్తున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు మోదీ వద్ద మంచి ఆలోచనలు ఉన్నాయని పుతిన్ అన్నారు. రష్యాలోని మాస్కోలో వాల్దాయ్ ఫోరం ఆఫ్ ఇంటర్నేషనల్ రష్యా ఎక్స్‌పర్ట్స్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉక్రెయిన్ వార్‌కు మోదీ వద్ద పరిష్కారం:  రష్యా అధ్యక్షుడు పుతిన్

ఇంటర్‌నెట్ డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు. ఉక్రెయిన్‌తో తాము చేస్తున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు మోదీ వద్ద మంచి ఆలోచనలు ఉన్నాయని పుతిన్ అన్నారు. రష్యాలోని మాస్కోలో వాల్దాయ్ ఫోరం ఆఫ్ ఇంటర్నేషనల్ రష్యా ఎక్స్‌పర్ట్స్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ముగింపు కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం ఆయన తీసుకుంటున్న చొరవ అభినందనీయం.


ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతియుత పరిష్కారం మోదీ వద్ద మంచి ఐడియాలు ఉన్నాయి. భారత్‌తో రష్యాకు మంచి ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. అలాగే, మోదీతోనూ నాకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి. అయినా కూడా ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించడం గురించి మోదీ నాతో పలుమార్లు ప్రస్తావించారు. యుద్ధం ముగించాలని అదేపనిగా కోరుతున్న పలు దేశాల అధినేతల్లో మోదీ కూడా ఒకరు’ అని పుతిన్ వ్యాఖ్యానించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మోదీ తటస్థ వైఖరి తీసుకున్నప్పటికీ యుద్ధం ముగింపువైపే ఆయన మొగ్గుచూపుతున్నారని పుతిన్ తెలిపారు. ఆ విషయాన్ని చెప్పడం తన విధి అని పేర్కొన్నారు. యుద్ధం అంతానికి మోదీ ఇచ్చిన సూచనలు, ఆలోచనలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


బ్రిక్స్‌లోనూ అదే ప్రస్తావన

గత నెల ఢిల్లీలో ముగిసిన బ్రిక్స్ సదస్సులోనూ పుతిన్‌తో మోదీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రస్తావించారు. దేశాల మధ్య సంఘర్షణలు, వివాదాలను పరిష్కరించుకోవడానికి చర్చలు, దౌత్యమే మార్గమని మోదీ పేర్కొన్న విషయం తెలిసిందే. అలాగే, బ్రిక్స్ సదస్సుకు రెండు వారాల ముందు కిర్గిస్తాన్‌లోని బిష్కెక్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ భేటీలోనూ మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ శకం యుద్ధాల శకం కాదని ఆయన వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి..

మచ్చార్‌ తెగువకు ప్రపంచం ఫిదా

నా వల్లే ఆ రెండు దేశాలు ఇంకా మిగిలున్నాయి: డొనాల్డ్ ట్రంప్

మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 02 , 2026 | 11:34 AM