నా వల్లే ఆ రెండు దేశాలు ఇంకా మిగిలున్నాయి: డొనాల్డ్ ట్రంప్
ABN , Publish Date - Oct 01 , 2026 | 10:04 PM
తాను లేకపోతే సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ దేశాలు భూమ్మీద నుంచి తుడిచిపెట్టుకుపోయేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: తాను లేకపోతే సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ దేశాలు భూమ్మీద నుంచి తుడిచిపెట్టుకుపోయేవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌదీ, ఇజ్రాయెల్‌తో స్నేహబంధం ఎలా ఉందన్న ప్రశ్నకు ఈ కామెంట్స్ చేశారు. హూతీ దాడుల విషయంలో యూఎస్ తీరుతో సౌదీ అరేబియా కినుక వహించిందన్న వార్తల నేపథ్యంలో ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు.
‘బాగుంది... ఎలాంటి సమస్యాల లేదు. నేను సౌదీ కోసం ఎంతో చేశాను. ఆ దేశానికి రక్షణగా ఉన్నాను. నేను అధ్యక్షుడిని కాకపోయి ఉంటే సౌదీ మనగలిగేదే కాదు. ఇజ్రాయెల్ పరిస్థితీ అంతే. భూమ్మీద నుంచి ఆ రెండు దేశాలు తుడిచిపెట్టుకుపోయి ఉండేవి. అమెరికా మద్దతు లేకుండా ఇజ్రాయెల్ తనని తాను రక్షించుకోగలిగి ఉండేది కాదు’ అని ట్రంప్ చెప్పారు.
ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ తనని తానను రక్షించుకోగలిగేలా చేయడమే తన లక్ష్యమని ట్రంప్ చెప్పారు. ఇరాన్‌కు అణ్వాయుధం దక్కనీయకూడదని అన్నారు. పిచ్చోళ్ల చేతికి అంతటి శక్తివంతమైన ఆయుధం దక్కకూడదని అన్నారు. ఇక ఇరాన్‌తో యుద్ధం తమ అంచనాలకంటే ఎక్కువ కాలమే సాగుతోందని కూడా ట్రంప్ అంగీకరించారు. తొలి దాడుల తరువాత కూడా తాము మరిన్ని మిలిటరీ చర్యలకు సిద్ధపడటమే ఇందుకు కారణమని చెప్పారు. సైనికపరంగా ఇరాన్ బలపడకూడదనే ఇలా చేశానని తెలిపారు. ఇటీవల శాంతిస్థాపనకు ఇరాన్ చేసిన ప్రతిపాదనలు తన అంచనాల మేరకు లేకపోవడంతోనే తిరస్కరించానని అన్నారు. మిడ్ టర్మ్ ఎన్నికల తరువాత కూడా ఇరాన్‌పై దాడులు కొనసాగించేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
స్మిత్ మచ్ఛర్ వేగంగా కోలుకుంటున్నారు: యూఏఈలో భారత రాయబారి
కో-పైలట్ ఒమన్ దేశస్థుడు.. రాడికల్ శిక్షణ తీసుకున్నాడు: ఇజ్రాయెల్