Share News

కో-పైలట్‌ ఒమన్ దేశస్థుడు.. రాడికల్ శిక్షణ తీసుకున్నాడు: ఇజ్రాయెల్

ABN , Publish Date - Oct 01 , 2026 | 07:39 PM

కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై కత్తితో దాడి చేసి విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన కో-పైలట్ ఒమన్ దేశస్థుడని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియోన్ సార్ తెలిపారు.

కో-పైలట్‌ ఒమన్ దేశస్థుడు.. రాడికల్ శిక్షణ తీసుకున్నాడు: ఇజ్రాయెల్
Dubai Tel Aviv Flight

ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఘటనపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై కత్తితో దాడి చేసి విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన కో-పైలట్ ఒమన్ దేశస్థుడని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియోన్ సార్ తెలిపారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. ఆ కో-పైలట్‌కు ఇస్లామిస్ట్ రాడికల్ శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు (Omani Co-Pilot).


కో-పైలట్ విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు ఇజ్రాయెల్ అధికారులు ఆరోపిస్తున్నారు. విమానం ఒక్కసారిగా భారీగా కిందికి దిగడం ఈ అనుమానాలకు కారణమైంది. గిడియోన్ సార్ ఈ ఘటనను 'జిహాదీ ఉగ్రవాద దాడి'గా అభివర్ణించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఇంకా తమ వద్ద లేవని ఆయన చెప్పారు. ఘటన వెనుక ఉద్దేశం ఏమిటో దర్యాప్తులో తేలుతుందని తెలిపారు. ప్రస్తుతం కో-పైలట్ సౌదీ అరేబియా అధికారుల అదుపులో ఉన్నాడు (Pilot Islamist Radicalisation).


ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ ఘటనపై మరిన్ని వ్యాఖ్యలు చేశారు (Dubai Tel Aviv Flight). తనకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం కో-పైలట్ ఇస్లామిస్ట్ రాడికల్ భావజాలంతో ప్రభావితమయ్యాడని, అతనికి రాడికల్ శిక్షణ ఇచ్చినట్టు తెలుస్తోందని చెప్పారు. అతను ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో ఉన్నట్లు కూడా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ దాడికి అతడు ఒంటరిగానే ప్లాన్ చేశాడా? ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

రూ. 9లక్షల కోట్లు ఆవిరి.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..


అస్సాంలో 9 మంది బంగ్లాదేశీయుల అరెస్ట్.. నకిలీ ఆధార్ కార్డులు స్వాధీనం.

Updated Date - Oct 01 , 2026 | 07:44 PM