స్మిత్ మచ్ఛర్ వేగంగా కోలుకుంటున్నారు: యూఏఈలో భారత రాయబారి
ABN , Publish Date - Oct 01 , 2026 | 09:14 PM
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారని యూఏఈలో భారత రాయబారి దీపక్ మిట్టల్ తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారని యూఏఈలో భారత రాయబారి దీపక్ మిట్టల్ తెలిపారు. గురువారం ఆసుపత్రిలో మచ్ఛర్‌ను ఆయన పరామర్శించారు. మచ్చర్ కుటుంబ సభ్యులను కూడా భారత రాయబారి కలిశారు (Smit Machchhar Health).
మచ్ఛర్ ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నారని, మంచి ఆరోగ్యంతో ఉన్నారని దీపక్ పేర్కొన్నారు. మచ్ఛర్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబానికి వివరాలు తెలియజేసి, అవసరమైన సహాయాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఎఫ్‌జెడ్-1073 విమానం కాక్‌పిట్‌లో జరిగిన ఘటనలో గాయపడిన స్మిత్ మచ్ఛర్‌ను తొలుత సౌదీ అరేబియాలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం యూఏఈకి తరలించారు (Smit Machchhar Recovery).
మచ్ఛర్ ప్రస్తుతం మాట్లాడుతున్నారని, కోలుకుంటున్నారని భారత రాయబార కార్యాలయం తెలిపింది (Flydubai Pilot). యూఏఈ అధికారులతో సమన్వయం చేసుకుంటూ మచ్ఛర్‌కు అవసరమైన వైద్య సహాయం, ఇతర సహాయాన్ని అందించేందుకు చర్యలు కొనసాగిస్తున్నట్టు పేర్కొంది. కాగా, ధైర్యంగా వ్యవహరించి 174 మంది ప్రాణాలను కాపాడిన మచ్చర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి..
రూ. 9లక్షల కోట్లు ఆవిరి.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..
అస్సాంలో 9 మంది బంగ్లాదేశీయుల అరెస్ట్.. నకిలీ ఆధార్ కార్డులు స్వాధీనం.