Donald Trump: గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటాం.. తేల్చి చెప్పిన ట్రంప్
ABN , Publish Date - Jan 10 , 2026 | 10:09 AM
గ్రీన్‌లాండ్‌ను ఎట్టిపరిస్థితుల్లో స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ఏ మాత్రం వెనకడుగు వేసినా ఆ ప్రాంతాన్ని రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయని ఆరోపించారు. రష్యా, చైనా అమెరికాకు పొరుగుదేశాల్లాగా ఉండటం తనకేమాత్రం ఇష్టం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు..
ఇంటర్నెట్ డెస్క్: అక్కడి ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా.. గ్రీన్‌లాండ్‌ను ఎట్టిపరిస్థితుల్లో స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ఏ మాత్రం వెనకడుగు వేసినా ఆ ప్రాంతాన్ని రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయని ఆరోపించారు. రష్యా, చైనా అమెరికాకు పొరుగుదేశాల్లాగా ఉండటం తనకేమాత్రం ఇష్టం లేదని ట్రంప్(Donald Trump) వ్యాఖ్యానించారు.
‘చర్చల ద్వారా గ్రీన్‌లాండ్(Greenland)ను పొందాలని అనుకున్నాం. కానీ అది సాధ్యం కాలేదు. కాబట్టే కఠిన మార్గాలను అనుసరించాల్సి వస్తోంది. గ్రీన్‌లాండ్ చుట్టూ ఉన్న జలాల్లో ఇప్పటికే చైనా, రష్యా తమ నౌకలను మోహరించి ఉన్నాయి. అమెరికా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోకపోతే ఆ పనిని చైనా, రష్యాలు చేస్తాయి. అందువల్లే గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి కఠిన మార్గాలను ఎంచుకోవడానికైనా మేం సిద్ధంగా ఉన్నాం. అమెరికాకు గ్రీన్‌లాండ్ వ్యూహాత్మకంగా, రక్షణపరంగా కీలకమైంది. ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి దానిపై నియంత్రణ అవసరం. దీనిపై మరింత లోతుగా చర్చలు జరపడానికి గ్రీన్‌లాండ్, డెన్మార్క్ నేతలతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటి అవుతారు’ అని ట్రంప్ వైట్‌హాస్‌లో మీడియా ముందు వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓడాం.. హర్మన్‌ప్రీత్ కౌర్
తమీమ్ ఇక్బాల్ ‘ఇండియన్ ఏజెంట్’.. బీసీబీ సభ్యుడి సంచలన ఆరోపణలు