ఉద్యోగం తొలగించినందుకు రూ.9,637 కోట్ల పరిహారం డిమాండ్ చేసిన మహిళా ఇంజినీర్
ABN , Publish Date - Sep 25 , 2026 | 02:30 PM
సౌనా (ఆవిరి గది)లో నిద్రించినందుకు ఓ మహిళా ఇంజినీర్‌ను గిట్‌పాడ్ అనే కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే ఈ నిర్ణయమే ఆ కంపెనీకి తలనొప్పిగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: సౌనా (ఆవిరి గది)లో నిద్రించినందుకు ఓ మహిళా ఇంజినీర్‌ను గిట్‌పాడ్ అనే కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే ఈ నిర్ణయమే ఆ కంపెనీకి తలనొప్పిగా మారింది. గిటపాట్ కంపెనీలో షానన్ బర్న్స్ అనే మహిళ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసేవారు. అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ ( ఏడీహెచ్‌డీ) అనే రుగ్మతతో బాధపడుతున్న ఆమె.. వర్క్ ట్రిప్‌లో భాగంగా 2023 ఏప్రిల్‌లో ఆస్ట్రియా వెళ్లారు. అయితే ఓ రాత్రి మద్యం సేవించిన షానన్ బర్న్స్ తన రూమ్ కీని మర్చిపోయారు. దీంతో ఆమె రాత్రంతా సౌనాలోనే నిద్రించారు.
ట్రిప్ ముగిసిన తరువాత జూన్ 2023లో షానన్ బర్న్స్‌ను ఉద్యోగం నుంచి గిట్‌పాడ్ సీఈఓ తొలగించారు. వృత్తిపరమైన బాధ్యత లేనందున తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన వివరించారు. దీన్ని సవాలు చేస్తూ షానన్ బర్న్స్ బర్మింగ్‌హోమ్ ఎంప్లాయ్‌మెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. తనకు ఏడీహెచ్‌డీ ఉందని, దీనివల్లే ఏకాగ్రత కోల్పోయానని ఆమె పేర్కొన్నారు. అన్నీ పరిశీలించిన ట్రిబ్యునల్.. వైకల్యాలకు సంబంధించిన కారణాలను పరిగణనలోకి తీసుకుని షానన్ బర్న్స్‌ను ఉద్యోగం నుంచి తప్పించారని తీర్పునిచ్చింది. బాధితురాలికి సదరు కంపెనీ నష్టపరిహారం చెల్లించాలని వెల్లడించింది.
పరిహారం @ రూ. 9,637 కోట్లు
తనకు ఏకంగా రూ. 9,637 కోట్ల రూపాయల నష్టపరిహారం కావాలని షానన్ బర్న్స్ డిమాండ్ చేశారు. అది విని కంపెనీ షాక్‌కు గురైంది. అన్ని లెక్కలూ వేసి ఈ మొత్తం అడుగుతున్నానని ఆమె వివరించారు. గతంలో కోల్పోయిన సంపాదన, భవిష్యత్తులో కోల్పోయే సంపాదన రెండూ కలిపి లెక్కించామని షానన్ బర్న్స్ తెలిపారు. కాగా ఈ భారీ పరిహారాన్ని చెల్లించడానికి గిట్‌పాడ్ అంగీకరించలేదు. కేవలం రూ.12.68 కోట్లు చెల్లిస్తామని ఆ కంపెనీ చెప్పింది. అయితే అదే కంపెనీలో షానన్ బర్న్స్‌కు ఉన్న 0.85 షేర్ల విలువను లెక్కిస్తే ఆమెకు రూ. 267.13 కోట్ల పరిహారం వచ్చే అవకాశముంది.
ఈ వార్తలూ చదవండి
జిన్‌పింగ్‌కు ట్రంప్ అరుదైన కానుక.. మూడు అడుగుల బాల్డ్ ఈగల్ శిల్పం బహూకరణ
ఎయిర్‌పోర్టుకు వచ్చి జిన్‌పింగ్‌కు ట్రంప్ స్వాగతం