Share News

మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసులో అభిషేక్‌ అరెస్టు

ABN , Publish Date - Sep 25 , 2026 | 06:24 AM

మహదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణంలో కీలక నిందితుడిగా భావిస్తున్న అభిషేక్‌ కుమార్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు.

మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసులో అభిషేక్‌ అరెస్టు

  • శంషాబాద్‌లో అదుపులోకి తీసుకున్న సీబీఐ

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మహదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణంలో కీలక నిందితుడిగా భావిస్తున్న అభిషేక్‌ కుమార్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. దుబాయ్‌ నుంచి వస్తున్న అతడిని హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇక్కడి సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచిన అధికారులు.. మూడు రోజుల ట్రాన్సిట్‌ రిమాండ్‌తో అతడిని ఛత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్‌కు తరలించామని, అక్కడ స్థానిక కోర్టులో హజరుపరిచి రెండు రోజుల కస్టడీకి తీసుకున్నామని గురువారం వెల్లడించారు. మహదేవ్‌ బుక్‌ పేరుతో సాగిన ఈ బెట్టింగ్‌ కుంభకోణంలో వివిధ బెట్టింగ్‌ ప్యానళ్లను సమన్వయం చేయడం, నిధులు సేకరించడం, అక్రమంగా వచ్చిన సొమ్ముతో దుబాయ్‌లో స్థిరాస్తులు కొనుగోలు చేయడం వంటి కార్యకలాపాల్లో అభిషేక్‌ కీలక పాత్ర పోషించినట్లు వారు తెలిపారు.

Updated Date - Sep 25 , 2026 | 06:26 AM