Share News

హూతీ స్థావరాలపై సౌదీ కూటమి ప్రతీకార దాడులు!

ABN , Publish Date - Oct 08 , 2026 | 10:06 AM

సౌదీ అరేబియాపై హూతీలు క్షిపణి, డ్రోన్ దాడులు చేసిన నేపథ్యంలో సౌదీ నేతృత్వంలోని కూటమి ప్రతీకార చర్యలకు దిగింది. యెమెన్‌లోని 82 హూతీ సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు కూటమి ప్రకటించింది.

హూతీ స్థావరాలపై  సౌదీ కూటమి ప్రతీకార దాడులు!
Saudi Coalition Houthi Strikes

Saudi Coalition Houthi Strikes: సౌదీ అరేబియాలోని పౌర విమానాశ్రయాలపై యెమెన్‌కు చెందిన హూతీ (Houthi) తిరుగుబాటుదారులు క్షిపణి, డ్రోన్ దాడులకు తెగబడ్డ నేపథ్యంలో సౌదీ నాయకత్వంలోని సైనిక కూటమి అత్యంత భారీ ప్రతీకార చర్యకు దిగింది. యెమెన్‌లోని వివిధ ప్రావిన్సుల్లో ఉన్న 82 హూతీ సైనిక స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు సౌదీ కూటమి అధికారికంగా ప్రకటించింది. పౌరులు, పౌర మౌలిక సదుపాయాలపై జరిగే క్రూరమైన దాడులను ఉపేక్షించేది లేదని, ఈ చర్యలకు తీవ్ర పర్యవసానాలు ఉంటాయని సౌదీ దళాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్-మాలికి హెచ్చరించారు.


అక్టోబర్ 6, 7 తేదీలలో సౌదీ రాజధాని రియాద్‌లోని కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, అభాలోని అభా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లను లక్ష్యంగా చేసుకుని హూతీలు దాడులు జరిపారు. ఈ దాడుల్లో ముగ్గురు మరణించగా, 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. అభా ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు, రియాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు ప్రతీకారంగా సౌదీ కూటమి యెమెన్‌లోని సాదా, అల్ హుదైదా, అల్ జౌఫ్, మారీబ్ ప్రాంతాల్లోని 82 హూతీ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ధ్వంసమైన వాటిలో 11 పర్వత శ్రేణుల బాలిస్టిక్ మిస్సైల్ నిల్వ కేంద్రాలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి...
సర్కార్‌ పనితీరు ఎలా ఉంది? ఏది నచ్చింది.. ఏది నచ్చలేదు..

ఓంకారేశ్వరాలయానికి.. రూ.948.65 కోట్లు
అక్టోబరు జీతంతోనే 2 డీఏలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2026 | 10:06 AM