Share News

దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి..

ABN , Publish Date - Mar 04 , 2026 | 08:08 AM

ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై భారీ ఎత్తున వైమానిక దాడులు ప్రారంభించాయి. దాదాపు నాలుగు రోజుల నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. వివరాల్లోకి వెళితే..

దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి..
Iran drone attack Dubai

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై భారీ ఎత్తున వైమానిక దాడులు ప్రారంభించాయి. దాదాపు నాలుగు రోజుల నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఎటాక్ చేస్తున్న నేపథ్యంలో, గల్ఫ్ దేశాల(Gulf countries)పై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇప్పటికే అబుదాబి, ఖతర్, కువైట్ లాంటి ప్రాంతాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. దుబాయ్‌(Dubai)లో మరోసారి డ్రోన్ దాడి చేసింది. అమెరికా కాన్సులేట్(Consulate)ను టార్గెట్ చేసుకొని ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసి పడటంతో స్థానికులు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ దాడిలో అమెరికా కాన్సులేట్ భవనం తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలు అదుపులోకి తెచ్చినట్లు, ప్రాణ నష్టం ఏమీ జరగలేదని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇరాన్(iran) దాడుల నేపథ్యంలో అమెరికా(America), ముందే తన దౌత్య కార్యాలయాల్లో అనవసర సిబ్బందిని తగ్గించి, భద్రతను కట్టుదిట్టం చేసింది.


ఇవి కూడా చదవండి..

నాటాంజ్ అణుక్షేత్రంపై యూఎస్, ఇజ్రాయెల్ దాడి.. ఇరాన్ రాయబారి సంచలన ప్రకటన

సౌదీలోని అతిపెద్ద రిఫైనరీపై ఇరాన్ దాడి.. వీడియో వైరల్

Updated Date - Mar 04 , 2026 | 09:02 AM