Share News

నాటాంజ్ అణుక్షేత్రంపై యూఎస్, ఇజ్రాయెల్ దాడి.. ఇరాన్ రాయబారి సంచలన ప్రకటన

ABN , Publish Date - Mar 02 , 2026 | 06:10 PM

అమెరికా, ఇజ్రాయెల్‌ తాజాగా నాటాంజ్‌లోని ఇరాన్ ప్రధాన అణుక్షేత్రంపై దాడి చేసినట్టు ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీలో ఇరాన్ రాయబారి రెజా నజాఫి తెలిపారు. అయితే దీనిని ఐక్యరాజ్యసమితి అణు నిఘా సంస్థ ఖండించింది.

నాటాంజ్ అణుక్షేత్రంపై యూఎస్, ఇజ్రాయెల్ దాడి.. ఇరాన్ రాయబారి సంచలన ప్రకటన
Natanz Nuclear facility

టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్‌ తాజాగా నాటాంజ్‌లోని ఇరాన్ ప్రధాన అణుక్షేత్రం (Natanz enrichment facility)పై దాడి చేసినట్టు ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA)లో ఇరాన్ రాయబారి రెజా నజాఫి తెలిపారు. అయితే దీనిని ఐక్యరాజ్యసమితి అణు నిఘా సంస్థ (UN nuclear watchdog) ఖండించింది. అణుక్షేత్రంపై దాడి జరిగిందనడానికి ఎలాంటి సాక్ష్యం లేదని తెలిపింది.


ఇరాన్‌‌పై సైనిక చర్యను ఇప్పటికే అమెరికా-ఇజ్రాయెల్ సమర్ధించుకున్నాయి. ఇరాన్ అణుసామర్థ్యాన్ని అడ్డుకోవడం ఒక ప్రధాన కారంగా తెలిపాయి. సొంతంగా అణ్వాయుధం తయారీ తుది దశలో ఇరాన్ ఉందని కూడా ఆ రెండు దేశాలు చెబుతున్నాయి.


అణుక్షేత్రంపై దాడి చట్టవిరుద్ధం

నాంటాజ్‌లోని అణుక్షేత్రంపై ఇజ్రాయెల్-యూఎస్ దాడి జరపడం చట్టవిరుద్ధమని రెజా నాజాఫీ ఆరోపించారు. ఇది పూర్తిగా నేరపూరిత, అనారిక చర్య అని అన్నారు. ఇరాన్ శాంతియుత సురక్షిత అణు సౌకర్యాలపై ఆదివారంనాడు మరోసారి దాడి జరిగిందని చెప్పారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయాలనుకోవడం పూర్తిగా అబద్ధమని చెప్పారు. కాగా, నాటాంజ్‌లోని అణుక్షేత్రంపై దాడులను అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ ఇంతవరకూ ధ్రువీకరించలేదు.


ఎలాంటి సంకేతాలు లేవన్న ఐఏఈఏ డెరెక్టర్ జనరల్

మరోవైపు, ఇరాన్ అణు సౌకర్యాలపై దాడి జరిగినట్టు ఎలాంటి సంకేతాలు లేవని ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాస్సీ తెలిపారు. ఈ విషయంలో ఇరాన్ న్యూక్లియర్ రెగ్యులేటరీ అధికారులతో సంప్రదించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. అయితే ఇంతవరకూ ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఇరాన్ సరిహద్దు దేశాల్లో రేడియేషన్ స్థాయిలు పెరిగిన సంకేతాలు కూడా లేవని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

నెతన్యాహు కార్యాలయంపై క్షిపణి దాడి... ఇరాన్ ఐఆర్‌జీసీ వెల్లడి

సౌదీలోని అతిపెద్ద రిఫైనరీపై ఇరాన్ దాడి.. వీడియో వైరల్

Updated Date - Mar 02 , 2026 | 06:52 PM