Share News

సౌదీ, బహ్రెయిన్ నేతలకు మోదీ ఫోన్.. భారతీయుల భద్రతపై ఆరా

ABN , Publish Date - Mar 02 , 2026 | 06:56 PM

సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారంనాడు ఫోను చేశారు. రెండు దేశాల్లోని భారతీయుల భద్రతపై ఆరా తీశారు.

సౌదీ, బహ్రెయిన్ నేతలకు మోదీ ఫోన్.. భారతీయుల భద్రతపై ఆరా
PM Modi with Saudi Arabia Prince

న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్య, ఇందుకు ప్రతిగా ఇరాన్ జరుపుతున్న దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణలు, డ్రోన్ దాడులపై విరుచుకుపడుతుండటం పరిస్థితిని మరింత తీవ్రం చేస్తోంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారంనాడు ఫోను చేశారు. ఇరువురు నేతలతో సంభాషణల్లో సౌదీ అరేబియా, బహ్రెయిన్‌పై ఇరాన్ జరుపుతున్న దాడులను మోదీ ఖండించారు. రెండు దేశాల్లోని భారతీయుల భద్రతపై ఆరా తీశారు.


కాగా, దీనికి ముందు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మోదీ ఫోనులో మాట్లాడారు. ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఘర్షణలను సాధ్యమైనంత త్వరగా ముగించాల్సిన అవసరాన్ని పునరుద్ధాటించారు. ఆదివారం రాత్రి భద్రతా వ్యవహరాల క్యాబినెట్ కమిటీ భేటీకి కూడా మోదీ అద్యక్షత వహించారు. పశ్చిమాసియాలో ఘర్షణల వల్ల తలెత్తిన పరిణామాల, ఆయా దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల భద్రతపై సమావేశంలో చర్చించారు.


ఇవి కూడా చదవండి..

నాటాంజ్ అణుక్షేత్రంపై యూఎస్, ఇజ్రాయెల్ దాడి.. ఇరాన్ రాయబారి సంచలన ప్రకటన

సౌదీలోని అతిపెద్ద రిఫైనరీపై ఇరాన్ దాడి.. వీడియో వైరల్

Updated Date - Mar 02 , 2026 | 07:51 PM