హోర్ముజ్లో భారీగా తేలియాడుతున్న ఐఫోన్ బాక్సులు.. వీడియో వైరల్
ABN , Publish Date - Oct 15 , 2026 | 04:47 PM
హోర్ముజ్ జలసంధిలో ఐఫోన్లు, లగ్జరీ పెర్ఫ్యూం టిళ్లలతో కూడిన బాక్సులు కుప్పలు కుప్పలుగా తేలియాడుతూ కనిపించాయి. యూఏఈకి చెందిన కార్గో నౌక 2500 కంటైనర్లతో బుధవారం హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తుండగా మైన్ను ఢీకొనడంతో నౌకలో మంటలు చెలరేగాయి. తర్వాత కొన్ని నిమిషాల్లోనే నౌక మునిగిపోయిన విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధిలో ఐఫోన్లు, లగ్జరీ పెర్ఫ్యూం బాటిళ్లలతో కూడిన బాక్సులు కుప్పలు కుప్పలుగా తేలియాడాయి. యూఏఈకి చెందిన కార్గో నౌక 2500 కంటైనర్లతో బుధవారం హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తుండగా మైన్ను ఢీకొనడంతో నౌకలో మంటలు చెలరేగాయి. తర్వాత కొన్ని నిమిషాల్లోనే నౌక మునిగిపోయిన విషయం తెలిసిందే. ఆ నౌకలో ఉన్న కంటైనర్లలో ఉన్న బాక్సుల్లో కొన్ని మునిగిపోగా, మరికొన్ని తేలియాడాయి. కంటైనర్ల నుంచి బయటకు వచ్చిన ఐఫోన్లు, పెర్ఫ్యూం బాటిళ్ల బాక్సులు సముద్రంపై భారీగా తేలియాడాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి గురువారం వెలుగులోకి వచ్చింది. నౌక మునిగిపోయిన ప్రాంతం వద్ద ఐఫోన్లు, పెర్ఫ్యూం బాటిళ్లు వందల సంఖ్యలో తేలియాడుతున్న దృశ్యం ఆ వీడియోలో ఉంది. కొందరు చిన్నచిన్న బోట్లలో సముద్రంలోకి వెళ్లి వాటిని సేకరించిన దృశ్యాలు కూడా రికార్డయ్యాయి.
కాగా.. మునిగిపోయిన ఆ నౌకను జీఎఫ్ఎస్ ప్రైడ్గా గుర్తించారు. సింగపూర్ జెండాతో దుబాయ్ నుంచి సరుకును రవాణా చేసుకుంటూ వెళ్తుండగా మైన్ను ఢీకొని ఆ నౌక సముద్రంలో మునిగిపోయింది. అందులో ఉన్న మొత్తం 21 మంది సిబ్బంది రక్షించామని మారీటైమ్ అధికారులు తెలిపారు. నౌక మునిగిపోయిన ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదన్నారు. కాగా.. హోర్ముజ్ జలసంధిలో గత పది రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాణిజ్య నౌకలపై ముమ్మరంగా దాడులు జరుగుతున్నాయి. గత నెలలో అమెరికా తమ పోర్టులను దిగ్బంధించి తమపై ఆంక్షలు విధించడంతో తాము ప్రతిదాడులు చేస్తున్నామని ఇరాన్ పేర్కొంది. దీంతో వ్యూహాత్మక జలమార్గం హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ వార్తలనూ చదవండి:
శ్వేతసౌధం కొత్త ప్రెస్ సెక్రటరీ తడబాటు.. ఊహించని మిస్టేక్..
పాకిస్థాన్లో 22 శాతం నీటి కొరత.. సొంత తప్పిదాలే కారణమా?