అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురి మృతి..
ABN , Publish Date - Oct 15 , 2026 | 07:57 AM
అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో మంగళవారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానం కూలిపోవడంతో ఓ చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన విస్కాన్సిన్ డెల్స్ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.
వాషింగ్టన్: అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో మంగళవారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానం కూలిపోవడంతో ఓ చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన విస్కాన్సిన్ డెల్స్ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. సాక్ కౌంటీ షెరీఫ్ కార్యాలయ అధికారుల ప్రకారం.. మంగళవారం రాత్రి ఆరు సీట్లు, ఒకే ఇంజిన్ కలిగిన పైపర్ PA-46 రకం చిన్న విమానం కెనోషా నుంచి మెనోమోనీకి బయలుదేరింది.
అయితే, స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటల సమయంలో డెల్లోనా పట్టణానికి చెందిన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రాంతం విస్కాన్సిన్ డెల్స్కు సుమారు 10 మైళ్ల దూరంలో ఉంది. ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, విమానంలో ఉన్న ఆరుగురూ అక్కడికక్కడే మృతిచెందగా.. ప్రజలెవరూ గాయపడలేదని అధికారులు పేర్కొన్నారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణంగా అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) దర్యాప్తు చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఆయా సంస్థల అధికారుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
హూతీలపై దాడులకు రెడీగా ఇజ్రాయెల్.. వారిస్తున్న సౌదీ
చైనా విడిభాగాలతో హూతీల క్షిపణులు.. ఇజ్రాయెల్, సౌదీ అరేబియాకు ముప్పు తప్పదా..