చైనా విడిభాగాలతో హూతీల క్షిపణులు.. ఇజ్రాయెల్, సౌదీ అరేబియాకు ముప్పు తప్పదా..
ABN , Publish Date - Oct 15 , 2026 | 07:47 AM
యెమెన్‌లోని ఇరాన్ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులు తమ క్షిపణి సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చైనా నుంచి సేకరించిన విడిభాగాలతో అధునాతన మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: యెమెన్‌లోని ఇరాన్ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులు తమ క్షిపణి సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చైనా నుంచి సేకరించిన విడిభాగాలతో అధునాతన మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని 'కాన్ఫ్లిక్ట్ ఆర్మమెంట్ రీసెర్చ్' సంస్థ వెల్లడించింది. ఈ క్షిపణులు ఇరాన్ అభివృద్ధి చేసిన ఖైబర్ షెకాన్ నమూనా ఆధారంగా ఉండవచ్చని పేర్కొంది (Houthis missiles).
ఈ తరహా క్షిపణికి సుమారు 1,200 మైళ్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. అంటే సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌లోని లక్ష్యాలు హూతీల పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. యెమెన్ అధికారులు ఇటీవల చైనా నుంచి వచ్చిన రెండు అనుమానాస్పద సరుకు రవాణాలను అడ్డుకున్నట్టు సమాచారం. వాటిలో క్షిపణుల తయారీకి ఉపయోగపడే లోహపు భాగాలు, రాకెట్ మోటార్లకు సంబంధించిన పరికరాలు, క్షిపణి ప్రయాణ సమయంలో ఉష్ణోగ్రతను తట్టుకునేందుకు ఉపయోగించే పదార్థాలు ఉన్నట్లు తెలుస్తోంది (Chinese missile parts).
హూతీలు అధునాతన మధ్యశ్రేణి క్షిపణులను అభివృద్ధి చేయగలిగితే సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌తో పాటు ప్రాంతీయ భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉంది (Israel missile threat). ముఖ్యంగా క్షిపణుల పరిధి, లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం, వాటిని అడ్డుకునే రక్షణ వ్యవస్థల పనితీరు కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా హూతీలకు చైనా విడి భాగాలను సరఫరా చేయడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.
ఇవి కూడా చదవండి:
తన పని తాను చేశాడు.. ఫలితం వెతుక్కుంటూ వచ్చింది: అశ్విన్
ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాం.. మళ్లీ ఒక్కటైన క్రికెటర్ పృథ్వీ షా-ఆకృతి