Share News

స్టార్‌లింక్ సేవలను నిలిపివేస్తే అమాయకులు బలైపోతారు: జెలెన్‌స్కీ

ABN , Publish Date - Oct 15 , 2026 | 10:05 AM

ఉక్రెయిన్‌లో శాటిలైట్ సేవలను పునరుద్ధరించాలని అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్టార్‌లింక్ సంస్థ అధినేత ఎలాన్ మస్క్‌ను అభ్యర్థించారు. ఇది తన పరిధిలోని అంశం కాదని మస్క్ బదులిచ్చారు.

స్టార్‌లింక్ సేవలను నిలిపివేస్తే అమాయకులు బలైపోతారు: జెలెన్‌స్కీ
Elon Musk, Zelenskyy

ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌లో శాటిలైట్ సేవలను పునరుద్ధరించాలని అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్టార్‌లింక్ సంస్థ అధినేత ఎలాన్ మస్క్‌ను అభ్యర్థించారు. రష్యా దాడులు కొనసాగుతున్న సమయంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకపోతే ఎందరో అమాయకుల ప్రాణాలు పోతాయని హెచ్చరించారు. బ్రిటిష్ జర్నలిస్టులతో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్స్ చేశారు.


‘దాడులు ఇలాగే కొనసాగితే.. స్టార్‌లింక్ సేవలు అందుబాటులో లేకపోతే సామాన్యులు మరణిస్తారు. పొరపాటున ఈ సేవలను నిలిపివేశారనే అనుకుంటున్నా. పెద్ద సాంకేతిక సమస్య తలెత్తి ఉండవచ్చు. కానీ మేము మాత్రం స్టార్‌లింక్ సేవలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము’ అని జెలెన్‌స్కీ అన్నారు. మిలిటరీ కార్యకలాపాల కోసం ఉక్రెయిన్ ఎక్కువగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలపైనే ఆధారపడుతోంది. ఈ అంశంపై ఉక్రెయిన్ మాజీ రక్షణ మంత్రి తాజాగా మాట్లాడుతూ శాటిలైట్ సేవలను పాక్షికంగా పునరుద్ధరించారని చెప్పారు.


ఈ అంశంపై మస్క్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ఆంక్షల అంశం స్పేస్‌ఎక్స్ పరిధిలోనిది కాదని అన్నారు. స్పేస్‌ఎక్స్ కేవలం పౌర, కమర్షియల్ శాటిలైట్ సేవల సంస్థ అని తెలిపారు. అమెరికా ప్రభుత్వ నియంత్రణలోని స్టార్‌షీల్డ్ ఆ వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని అన్నారు. యూఎస్ మిలిటరీ, అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలపైనే అవి ఆధారపడి ఉంటాయని చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

సిబిల్ స్కోర్ పడిపోయిందా..? ఆరు నెలల్లో పెంచుకోండిలా

ఫెయిర్‌ఫాక్స్‌ చేతికి ఐడీబీఐ బ్యాంకు

Updated Date - Oct 15 , 2026 | 11:26 AM