కాలిఫోర్నియాలో దారుణం.. భారత సంతతి వ్యక్తి కిడ్నాప్ ఆపై హత్య
ABN , Publish Date - Feb 25 , 2026 | 07:39 AM
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన అవతార్ సింగ్ కిడ్నాప్ ఉదంతం విషాదాంతమైంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా(America)లోని కాలిఫోర్నియా(California) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన అవతార్ సింగ్(57) కిడ్నాప్ ఉదంతం విషాదాంతమైంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే అవతార్ సింగ్‌ని దుండగులు కిడ్నాప్ చేయడమే కాదు.. దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానిక సిక్కు కమ్యూనిటీని, ప్రవాస భారతీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిన్న (మంగళవారం) మధ్యాహ్నం కాలిఫోర్నియాలోని ట్రెసీ సిటీ(Tracy)లో ఉన్న స్థానిక గురుద్వారా(Gurudwara) వెలుపల ఈ ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షుల తెలిపిన వివరాల ప్రకారం.. ఒక తెల్లటి ఎస్‌యూవీ(SUV)లో వచ్చిన ముగ్గురు దుండగులు.. అవతార్ సింగ్‌ను కిడ్నాప్ చేశారు.
వాస్తవానికి కిడ్నాపర్లు మరో వ్యక్తిని కిడ్నాప్ చేయాల్సింది పోయి.. తప్పుగా అవతార్ సింగ్‌ని కిడ్నాప్ చేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కిడ్నాపర్లు తమ గుట్టు బయటపడుతుందని భయంతో అవతార్ సింగ్‌ని హత్య చేసి ‘లేక్ బెరీస్సా’ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అవతార్ సింగ్ గత 20 ఏళ్లుగా ట్రేసీలోని గురు ద్వారాలో వాలంటీర్‌గా (వంట మనిషిగా) పనిచేస్తూ అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండేవారు. ఆయనకు భార్య ఆరు నెలల వయసున్న ముగ్గురు కవల పిల్లలు ఉన్నారు. అవతార్ సింగ్ మరణం అతని కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News