Share News

మతాన్ని వదులుకున్నట్లు రుజువులు ఇవ్వండి

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:44 AM

నో క్యాస్ట్‌.. నో రెలీజియన్‌’ సర్టిఫికెట్‌ కావాలంటే ముందుగా మతాన్ని వదులుకోవాలని మద్రాస్‌ హైకోర్టు సూచించింది. తనకు ‘నో క్యాస్ట్‌..

మతాన్ని వదులుకున్నట్లు రుజువులు ఇవ్వండి

  • ‘నో క్యాస్ట్‌.. నో రెలీజియన్‌’ సర్టిఫికెట్‌ జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై మద్రాస్‌ హైకోర్టు స్పష్టీకరణ

చెన్నై, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): ‘నో క్యాస్ట్‌.. నో రెలీజియన్‌’ సర్టిఫికెట్‌ కావాలంటే ముందుగా మతాన్ని వదులుకోవాలని మద్రాస్‌ హైకోర్టు సూచించింది. తనకు ‘నో క్యాస్ట్‌.. నో రెలీజియన్‌’ సర్టిఫికెట్‌ జారీ చేయడానికి తిరుపత్తూర్‌ తహశీల్దారు నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ చెల్లమాణిక్యం అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇటీవల విచారణ చేపట్టింది. పిటిషనర్‌ మతాన్ని వదులుకున్నారా? అని ప్రశ్నించింది. లేదని సమాధానం ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హిందూ ఆచారాల ప్రకారం పిటిషనర్‌ తన మతాన్ని వదులుకునే వరకు ఆయన అభ్యర్థనను అధికారులు పరిగణనలోకి తీసుకోలేరని స్పష్టం చేసింది. మతాన్ని వదులుకోకుండా, మతాన్ని వదులుకున్నట్లు తెలిపే రుజువులు సమర్పించకుండా ‘నో రెలీజియన్‌’ సర్టిఫికేట్‌ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. మతాన్ని వదులుకోడానికి, అధికారుల ముందు ఆ రుజువులు సమర్పించడానికి పిటిషనర్‌కు స్వేచ్ఛ ఇచ్చింది.

Updated Date - Feb 25 , 2026 | 12:44 AM