యెమెన్ ట్రైనింగ్ క్యాంప్‌పై హౌతీల దాడి.. 53 మంది మృతి
ABN , Publish Date - Oct 19 , 2026 | 09:51 PM
యెమెన్‌లోని షబ్వా ప్రావిన్స్‌లో హౌతీలు సోమవారం భీకర దాడి చేశారు. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబెల్స్.. ప్రభుత్వ భద్రతా బలగాల శిక్షణ శిబిరంపై దాడి చేశారు. ఈ దాడిలో 53 మంది మరణించగా, 200 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు.
ఇంటర్‌నెట్ డెస్క్: యెమెన్‌లోని షబ్వా ప్రావిన్స్‌లో హౌతీలు సోమవారం భీకర దాడి చేశారు. ఇరాన్ మద్దతున్న హౌతీ రెబెల్స్.. ప్రభుత్వ భద్రతా బలగాల శిక్షణ శిబిరంపై దాడి చేశారు. ఈ దాడిలో 53 మంది మరణించగా, 200 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. శిక్షణ కార్యక్రమం జరుగుతున్న సమయంలో హౌతీలు తమ భద్రతా దళాలపై మూడు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
కాగా.. యెమెన్ ట్రైనింగ్ క్యాంపును లక్ష్యంగా చేసుకుని దాడి చేశామని హౌతీ మిలిటరీ ప్రతినిధి యహ్యా సరీ ఎక్స్‌లో తెలిపారు. ఆ శిక్షణ శిబిరాన్ని సౌదీ బలగాలు నడుపుతున్నాయని ఆయన చెప్పారు. అయితే, సరీ కామెంట్లపై సౌదీ అధికారులు స్పందించలేదు. హౌతీల ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వ బలగాలు ఈనెల నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాగా.. గత నెలలో బాబ్ ఎల్ మందెబ్ జలసంధిని హౌతీలు దాటడంతో హూతీలకు, సౌదీల నేతృత్వంలోని కూటమి మద్దతు ఉన్న అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వానికి మధ్య భీకరంగా పోరు జరుగుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
హెచ్1బీ వీసాదారులకు వ్యతిరేకం కాదు: జేడీ వాన్స్
ఒక్క రోజులో విధానాన్ని మార్చుకోవడం కష్టం: యూఎస్ మంత్రి మార్కో్ రూబియో