Share News

ఫ్రాన్స్‌ మంటల మధ్యలో ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటున్న ఓ జంట.. వీడియో వైరల్

ABN , Publish Date - Oct 19 , 2026 | 09:40 PM

హింసాత్మక నిరసనల నడుమ ఓ వైపు ఫ్రాన్స్ తగలబడి పోతుంటే.. ఓ జంట మాత్రం తమకేం సంబంధం లేదన్నట్టుగా ఓ కేఫే బయట కూర్చుని డ్రింక్‌ను ఆస్వాదిస్తూ.. కబుర్లు చెప్పుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌‌గా మారింది.

ఫ్రాన్స్‌ మంటల మధ్యలో ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటున్న ఓ జంట.. వీడియో వైరల్
france couple video went viral

ఇంటర్నె్ట్ డెస్క్: పెరుగుతున్న జీవన వ్యయానికి వ్యతిరేకంగా ఫ్రాన్స్ అంతటా హింసాత్మక నిరసనలు కొనసాగుతున్న వేళ.. ఓ జంట మాత్రం తమకేం సంబంధం లేదన్నట్టుగా.. ఓ కేఫేలో కూర్చుని ప్రశాంతంగా డ్రింక్స్ ఆస్వాదిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. వారికి కొన్ని మీటర్ల దూరంలోనే మంటలు చెలరేగుతున్నప్పటికీ.. వారు ప్రశాంతంగా కబుర్లు చెప్పుకోవడం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.


నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండడం, జీవన వ్యయం భారంగా మారటాన్ని వ్యతిరేకిస్తూ ఫ్రాన్స్ యువత, మేధావులు, కార్మికసంఘాలు నిరసనలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరసనకారులు పెద్దఎత్తున రోడ్లపై గుమిగూడి ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల నిరసనలు హింసాత్మక రూపాన్ని దాల్చుతున్నాయి. ఈ క్రమంలో పారిస్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.


పారిస్‌లోని ప్రసిద్ధ ఆర్క్ డి ట్రియోంఫ్ సమీపంలోని ఓ కేఫేలో అక్టోబర్ 17, శనివారం రికార్డు అయిన ఓ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ వీడియోలో ఓ జంట.. కెఫే బయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ డ్రింక్స్ ఆస్వాదిస్తున్నారు. అయితే.. వారికి కొన్ని మీటర్ల దూరంలోనే మంటలు చెలరేగుతుండడమే ఈ వీడియో వైరల్ అవ్వడానికి ప్రధాన కారణం. తమ పరిధిలోనే మంటలు అంటుకుంటున్నప్పటికీ.. ఏమీ పట్టనట్లు, వారు ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.


‘గందరగోళం, నిరసనల మధ్య వారు అలా ప్రశాంతంగా కూర్చోవడం చూస్తుంటే.. ప్రతిఘటన, మనోధైర్యానికి ప్రతీకగా అనిపిస్తోంది’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘ఫ్రాన్స్‌లో ఓ వైపు హింసాత్మక ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ.. దైనందిన జీవితాలు యథావిథిగా కొనసాగుతున్నయని ఈ వీడియో చూస్తుంటే అర్థం అవుతోందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

హెచ్‌1బీ వీసాదారులకు వ్యతిరేకం కాదు: జేడీ వాన్స్

ఒక్క రోజులో విధానాన్ని మార్చుకోవడం కష్టం: యూఎస్ మంత్రి మార్కో్ రూబియో

Updated Date - Oct 19 , 2026 | 09:50 PM