మాజీ బాస్ భార్యపై దుర్భాషలు.. యూకే అకౌంటెంట్‌కు రూ.కోటి ఫైన్
ABN , Publish Date - Oct 19 , 2026 | 05:12 PM
మాజీ బాస్‌తో పాటు ఆయన భార్యను దుర్భాషలాడిన యూకే అకౌంటెంట్‌కు ఇంగ్లండ్‌లో ఓ ట్రైబ్యునల్ 78,600 పౌండ్ల (రూ.కోటి) జరిమానా విధించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎడ్వర్డ్ ఫ్రాంక్లిన్ అనే అకౌంటెంట్ గతంలో హెచ్ అనే కంపెనీలో పనిచేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: మాజీ బాస్‌తో పాటు ఆయన భార్యను దుర్భాషలాడిన యూకే అకౌంటెంట్‌కు ఇంగ్లండ్‌లో ఓ ట్రైబ్యునల్ 78,600 పౌండ్ల (రూ.కోటి) జరిమానా విధించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎడ్వర్డ్ ఫ్రాంక్లిన్ అనే అకౌంటెంట్ గతంలో హెచ్ అనే కంపెనీలో పనిచేశాడు. 2022 ఏప్రిల్‌లో ఆయనను కంపెనీ తొలగించింది. రెండు నెలల తర్వాత ఆ కంపెనీ కూడా పలు కారణాల వల్ల మూతపడింది. కాగా.. కంపెనీ నుంచి తొలగింపునకు గురైన తర్వాత ఫ్రాంక్లిన్ సొంతంగా ఒక అకౌంటెన్సీ ఫర్మ్ స్థాపించాడు. హెచ్ క్లైంట్లు ఫ్రాంక్లిన్ సంస్థకు మారారు. 2022 జూన్‌లో ఓ క్లైంట్.. ఫ్రాంక్లిన్ సంస్థకు బదులుగా హెచ్‌కు అనుకోకుండా ఒక పేమెంట్ పంపారు. ఈ విషయంలో ఫ్రాంక్లిన్, అతని మాజీ బాస్ అయిన హెచ్ ఓనర్ మధ్య వివాదం రేగింది.
ఈ క్రమంలో మాజీ బాస్‌ను ఫ్రాంక్లిన్ దుర్భాషలాడాడు. అంతేకాకుండా 2022 సెప్టెంబరులో మాజీ బాస్ భార్యను కూడా అసహ్యకరమైన భాషలో తిట్టాడు. ఇద్దరు వ్యక్తులను ఈమెయిల్లో కాపీచేసి దమ్ముంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ (ఐసీఏఈడబ్ల్యూ) లో ఫిర్యాదు చేయాలని ఫ్రాంక్లిన్ సవాలు చేశాడు. దీంతో మాజీ ఓనర్ సవాలు చేయగా.. తాను దుర్భాషలాడినట్లు ఫ్రాంక్లిన్ ఒప్పుకున్నాడు. తాను అసహ్యకరమైన, అంగీకరించలేని భాషను వాడానని చెప్పాడు. దీంతో ట్రైబ్యునల్ అతనికి 78,600 పౌండ్ల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.
Also Read:
‘హింస అనేది వాళ్ల డీఎన్ఏలోనే ఉంది’.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
రూ.256.75 కోట్ల పనుల బిల్లుల అప్‌లోడ్‌లో నిర్లక్ష్యం.. గోదావరి డెల్టా సీఈకి మెమో
ఏపీ స్థానిక ఎన్నికలపై మంత్రి లోకేశ్ పవర్ఫుల్ పోస్టు.. ఏమన్నారంటే..