Share News

విమానం కూల్చాలనుకున్నా.. చావంటే భయం లేదు: ఫ్లైదుబాయ్ కోపైలట్

ABN , Publish Date - Oct 04 , 2026 | 09:27 PM

ఫ్లైదుబాయ్ ఘటన తరువాత యూఏఈ అధికారులు కో-పైలట్ హమామీని విచారిస్తున్నారు.

విమానం కూల్చాలనుకున్నా.. చావంటే భయం లేదు: ఫ్లైదుబాయ్ కోపైలట్

ఇంటర్నెట్ డెస్క్: ‘విమానం కూల్చాలనుకున్నా. ఆ సమయంలో చావడానికి కూడా వెనకడుగు వేయలేదు’ అని విచారణ సందర్భంగా ప్లైదుబాయ్ కో-పైలట్ హమామ్ అల్ హమామీ చెప్పాడు. తాను ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు అంగీకరించాడు. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. ఫ్లైదుబాయ్ ఘటన తరువాత యూఏఈ అధికారులు హమామీని విచారిస్తున్నారు. ఏవైనా ఉగ్రవాద సంస్థలతో అతడికి సంబంధాలున్నాయా..? అనే కోణంలో విచారణ సాగుతోంది.


యూఏఈ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌కు 170 మందితో వెళ్తున్న విమానం కూల్చడానికి ఉగ్రకుట్ర జరిగిన విషయం తెలిసిందే. ఆ విమానానికి కో-పైలట్‌గా ఉన్న హమామ్ ప్రధాన పైలట్‌ స్మిత్ మచ్చార్‌‌పై దాడి చేశాడు. మచ్చార్ ప్రాణాలకు తెగించి ప్రయాణికులను రక్షించారు. ప్రయాణికుల్లో ఉన్న ఇద్దరు పైలట్ల సహాయంతో విమానాన్ని క్షేమంగా సౌదీ అరెబియాలో ల్యాండ్ చేశారు.


ఈ వార్తలూ చదవండి

కో-పైలట్‌ను వదిలిపెట్టాలన్న ఫ్లైదుబాయ్ సిబ్బంది?

ఫ్లైదుబాయ్ ఘటన.. ఒమన్ కోపైలట్‌ ఆస్ట్రేలియా లింకులపై దర్యాప్తు

Updated Date - Oct 04 , 2026 | 09:30 PM