Share News

ఫ్లైదుబాయ్ ఘటన.. ఒమన్ కోపైలట్‌ ఆస్ట్రేలియా లింకులపై దర్యాప్తు

ABN , Publish Date - Oct 04 , 2026 | 07:24 PM

ఫ్లైదుబాయ్ విమానంలో భారత పైలట్ స్మిత్ మచ్చార్‌పై దాడి చేసి హైజాక్‌కు యత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒమన్ కోపైలట్ హమామ్ అల్ హమ్మమీపై తాజాగా ఆస్ట్రేలియా దర్యాప్తు ప్రారంభించింది.

ఫ్లైదుబాయ్ ఘటన.. ఒమన్ కోపైలట్‌ ఆస్ట్రేలియా లింకులపై దర్యాప్తు
ఫ్లైదుబాయ్ కోపైలట్ ఆస్ట్రేలియా లింకులపై దర్యాప్తు

Flydubai Co Pilot Australia Probe: ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో భారత పైలట్ స్మిత్ మచ్చార్‌పై దాడి చేసి హైజాక్‌కు యత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒమన్ కోపైలట్ హమామ్ అల్ హమ్మమీపై తాజాగా ఆస్ట్రేలియా దర్యాప్తు ప్రారంభించింది. 2015–2017 మధ్య ఆస్ట్రేలియాలో విద్యార్థిగా ఉన్న సమయంలో అతడు తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షితుడయ్యాడా అనే కోణంలో ఆస్ట్రేలియా భద్రతా సంస్థలు పరిశీలిస్తున్నాయి.


ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ (AFP) భద్రతా సంస్థలు ఈ కో-పైలట్‌కు ఆస్ట్రేలియాతో ఉన్న సంబంధాలపై విచారణ జరుపుతున్నాయి. ఇతను 2015-2017 మధ్య ఆస్ట్రేలియాలో విద్యార్థి వీసాపై చదువుకున్నాడని, ఆ సమయంలోనే అతను తీవ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడా (Radicalised) అనే కోణంలో ఆస్ట్రేలియా నిఘా వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి.

గతంలో ఒమన్ ఎయిర్‌లో పనిచేస్తున్నప్పుడు ఇతని తీవ్రవాద భావజాలం కారణంగా విమాన శిక్షణ నుంచి తప్పించారు. దీంతో బ్రిటన్‌కు చెందిన బకింగ్‌హామ్‌షైర్ న్యూ యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్ లర్నింగ్ ద్వారా ఏవియేషన్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసినట్లు తెలిసింది.


దుబాయ్ నుంచి టెల్ అవీవ్ (ఇజ్రాయెల్) వెళ్తున్న ఫ్లైదుబాయ్ (FZ1073) విమానంలో ఒమన్ జాతీయుడైన కో-పైలట్ (హమామ్ అల్-హమ్మమీ) కెప్టెన్‌పై గొడ్డలితో దాడి చేసి విమానాన్ని హైజాక్ చేయడానికి, తీవ్రవాద చర్యకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. భారత జాతీయుడైన కెప్టెన్ స్మిత్ మచ్చార్ గాయపడినప్పటికీ, సమయస్ఫూర్తితో కాక్‌పిట్ తలుపులు తెరవడంతో ప్రయాణీకులు కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.


ఈ వార్తలూ చదవండి

పాక్ హనీట్రాప్‌లో భారత నేవీ ఉద్యోగి.. రక్షణ రహస్యాల లీక్ ఆరోపణలపై అరెస్ట్

క్షణాల్లో ఘోరం.. 100 మీటర్ల లోయలో పడ్డ కారు!

Updated Date - Oct 04 , 2026 | 07:38 PM