ఏపీలో బీపీసీఎల్ భారీ ప్రాజెక్ట్‌కు కేంద్ర పర్యావరణ గ్రీన్‌సిగ్నల్!
ABN , Publish Date - Oct 04 , 2026 | 09:10 PM
ఆంధ్రప్రదేశ్‌లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్‌కు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది.
అమరావతి, అక్టోబర్ 04: ఆంధ్రప్రదేశ్‌లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్‌కు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. రూ.1 లక్ష కోట్లకు పైగా అంచనా వ్యయంతో నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్ట్ సమీపంలో 5,200 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ఈ కాంప్లెక్స్ ద్వారా ఏడాదికి 9 మిలియన్ మెట్రిక్ టన్నుల (9 MTPA) సామర్థ్యంతో పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోకెమికల్ ఉత్పత్తులను తయారు చేయనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, ప్రాజెక్ట్ ప్రాంగణంలో 30 శాతం మేర (సుమారు 1,563 ఎకరాలు) గ్రీన్ బెల్ట్‌గా అభివృద్ధి చేసేందుకు బీపీసీఎల్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాజెక్ట్ రాకతో రాష్ట్ర పారిశ్రామిక రంగానికి మరింత ఊతెక్కనుంది.
ఇవి కూడా చదవండి:
మీకెందుకు ఇబ్బంది.. స్టాలిన్ 'షూటింగ్' వ్యాఖ్యలకు సీఎం విజయ్ ఘాటు కౌంటర్..
ప్రకృతి సాగులో ఏపీ నంబర్ వన్.. సీఎం చంద్రబాబుకు శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రశంసలు
రైలులోనే మీ వస్తువులు మర్చిపోయారా.. తిరిగి పొందే మార్గం ఇదే..!