మా అమ్మ పీసీబీకి దూరంగా ఉండమని చెప్పింది: షోయబ్ అక్తర్
ABN , Publish Date - Oct 04 , 2026 | 08:42 PM
చీఫ్ సెలెక్టర్ పదవి కోసం పాక్ మాజీ స్టార్ పేసర్ షోయబ్ అక్తర్‌ను ఎంపిక చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిపై ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో చీఫ్ సెలెక్టర్ పదవి కోసం పాక్ మాజీ స్టార్ పేసర్ షోయబ్ అక్తర్‌ను ఎంపిక చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిపై ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’ స్పందించాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)లో ఎలాంటి పదవి చేపట్టే ఆసక్తి తనకు లేదని స్పష్టం చేశాడు.
‘చీఫ్ సెలెక్టర్ పదవి గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ ఊహాగానాలే. నేను గతంలో చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నాను. మా అమ్మ పాకిస్థాన్ బోర్డుకు దూరంగా ఉండమని చెప్పింది. నా తల్లి ఇచ్చిన సలహానే పాటిస్తాను. నాకు కావాల్సింది పాకిస్థాన్ క్రికెట్ అభివృద్ధి మాత్రమే. అలాగే ఈ పదవి కోసం నేను పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీని కలిశానంటూ కూడా వార్తలు వచ్చాయి. నేను ఆయన్ను కలవలేదు. ఎలాంటి చర్చలూ జరపలేదు. పాకిస్థాన్ క్రికెట్‌కు సేవ చేయాలన్న కోరిక ఉంది. కానీ అందుకోసం పీసీబీలో అధికారిక పదవి చేపట్టాల్సిన అవసరం లేదు. దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి’ అని అక్తర్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
పిల్లలతోనే రిలాక్సేషన్.. ఇంటికొచ్చాక రోహిత్ శర్మ ఏం చేస్తాడంటే?
వన్డే ప్రపంచ కప్.. వచ్చే ఏడాది అత్యంత కీలకం: కేఎల్ రాహుల్