Share News

పిల్లలతోనే రిలాక్సేషన్.. ఇంటికొచ్చాక రోహిత్ శర్మ ఏం చేస్తాడంటే?

ABN , Publish Date - Oct 04 , 2026 | 07:28 PM

క్రికెట్, ప్రయాణాలతో బిజీగా ఉండే రోహిత్ శర్మ ఇంటికి వచ్చిన తర్వాత ఎలా రిలాక్స్ అవుతాడని ఓ షోలో ప్రశ్న ఎదురైంది. దీనికి రోహిత్ ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది.

పిల్లలతోనే రిలాక్సేషన్.. ఇంటికొచ్చాక రోహిత్ శర్మ ఏం చేస్తాడంటే?
Rohit Sharma

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ మైదానంలో ఎంత బిజీగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస మ్యాచ్‌లు, సుదీర్ఘ పర్యటనలతో ఎక్కువ సమయం ఇంటికి దూరంగా గడపాల్సి వస్తుంది. అయితే ఎప్పుడైనా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మాత్రం తన పిల్లలతో సమయం గడపడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడట. తన రిలాక్సేషన్ మోడ్ ఏంటో స్వయంగా రోహిత్ వెల్లడించాడు.


ఇటీవల సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో ప్రసారమయ్యే ‘ఫ్యామిలీ ఫుల్ హౌస్’ కార్యక్రమానికి రోహిత్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నటి అంకితా లోఖండే.. క్రికెట్, ప్రయాణాలతో బిజీగా ఉండే రోహిత్ ఇంటికి వచ్చిన తర్వాత ఎలా రిలాక్స్ అవుతాడని ప్రశ్నించింది. దీనికి రోహిత్ శర్మ ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది.


‘నేను నా ఇద్దరు పిల్లల వెనకే పరుగెత్తుతుంటా. వాళ్లతో ఉండటం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఇంతగా ప్రయాణాలు చేస్తుంటే ఇంట్లో ఎక్కువ సమయం గడపలేం. అందుకే ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్లు ఇంట్లో ఏం చేస్తున్నారు? ఎక్కడికి పరుగెడుతున్నారు? అని చూస్తూ.. వాళ్ల వెనకే తిరుగుతుంటా’ అని రోహిత్ చెప్పాడు. ఈ సమాధానంపై అంకితా కూడా స్పందిస్తూ.. పిల్లలతో గడపడమే బెస్ట్ థెరపీ అని ప్రశంసించింది. రోహిత్ శర్మ, రితికా సజ్జే 2015లో వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో కుమార్తె సమైరా జన్మించింది. 2024లో కుమారుడు అహాన్ జన్మించాడు.


ఇవి కూడా చదవండి:

జమ్ము కశ్మీర్‌పై ఘన విజయం.. రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్‌దే ఇరానీ కప్

వయసు కంటే ఎక్కువ వన్డే సెంచరీలు ఉండాలి.. రోహిత్‌కు గావస్కర్ టార్గెట్

Updated Date - Oct 04 , 2026 | 07:29 PM