జమ్ము కశ్మీర్‌పై ఘన విజయం.. రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్‌దే ఇరానీ కప్
ABN , Publish Date - Oct 04 , 2026 | 04:06 PM
ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా అదరగొట్టింది. రంజీ ట్రోఫీ విజేత జమ్ము కశ్మీర్‌తో ఆదివారం శ్రీనగర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 167 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 2026-27 ఇరానీ కప్‌ను కైవసం చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా అదరగొట్టింది. రంజీ ట్రోఫీ విజేత జమ్ము కశ్మీర్‌తో ఆదివారం శ్రీనగర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 167 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 2026-27 ఇరానీ కప్‌ను కైవసం చేసుకుంది. రెస్ట్ ఆఫ్ ఇండియాకు ఇది 31వ ఇరానీ కప్ టైటిల్ కావడం విశేషం. ఇందులో ఒకసారి టైటిల్‌ను సంయుక్తంగా పంచుకుంది.
279 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జమ్ము కశ్మీర్.. 111 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు చివరి ఏడు వికెట్లను కేవలం 22 పరుగుల వ్యవధిలో కోల్పోవడం గమనార్హం. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ సత్తాచాటాడు. 33 పరుగులు ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ దీప్ మూడు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా 237 పరుగులు చేయగా.. జమ్ము కశ్మీర్ 278 రన్స్ చేసి లీడ్ సాధించింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ సేన 319 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లీడ్ కోల్పోయినప్పటికీ రెస్ట్ ఆఫ్ ఇండియా విజయం సాధించి కప్‌ను ముద్దాడటం విశేషం. స్మరణ్ రవిచంద్రన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 68 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులతో రాణించాడు.
ఇవి కూడా చదవండి:
వయసు కంటే ఎక్కువ వన్డే సెంచరీలు ఉండాలి.. రోహిత్‌కు గావస్కర్ టార్గెట్
షో చేయడానికే పనికొస్తారు.. వైభవ్‌కు ఆయూబ్ సెండాఫ్‌పై పాక్ మాజీ క్రికెటర్ ఫైర్