అమిర్ జాంగూ అరుదైన రికార్డు.. భారత్‌లో తొలి మూడు వన్డేల్లో 50+ స్కోర్లు
ABN , Publish Date - Oct 04 , 2026 | 02:29 PM
భారత్‌తో తాజాగా ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ బ్యాటర్ అమిర్ జాంగూ ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఈ సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో
భారత్‌తో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన భారత్.. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. మరోవైపు టీమిండియాతో తాజాగా జరిగిన ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ బ్యాటర్ అమిర్ జాంగూ(Amir Jangoo Record) ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 50కిపైగా స్కోర్ చేశాడు. దీంతో భారత్‌లో తొలి మూడు వన్డే ఇన్నింగ్స్‌ల్లో 50కిపైగా స్కోర్లు చేసిన ఐదో బ్యాటర్‌గా అమిర్ జాంగూ నిలిచాడు. అంతేకాక తొలి విండీస్ బ్యాటర్ గా కూడా రికార్డు సృష్టించాడు. ఈ సిరీస్‌లో జాంగూ తొలి వన్డేలో 58 పరుగులు నాటౌట్, రెండో వన్డేలో 114 పరుగులు, మూడో వన్డేలో67 పరుగులు చేశాడు.
భారత్‌లో తొలి మూడు వన్డే ఇన్నింగ్స్‌ల్లో 50కిపైగా పరుగులు చేసిన బ్యాటర్లు
నవ్‌జోత్ సింగ్ సిద్ధూ (భారత్), 1987
మార్క్ వా (ఆస్ట్రేలియా), 1996
మాథ్యూ హేడెన్ (ఆస్ట్రేలియా), 2001
జేసన్ రాయ్ (ఇంగ్లండ్), 2017
అమిర్ జాంగూ (వెస్టిండీస్), 2026
భారత్‌తో సిరీస్‌లో జాంగూ మూడు ఇన్నింగ్స్‌ల్లో 135కిపైగా స్ట్రైక్‌రేట్‌తో 239 పరుగులు చేసి,సిరీస్‌లో రెండో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. 334 పరుగులతో గిల్ తొలి స్థానంలో ఉన్నాడు. చండీగఢ్ వేదిగా జరిగిన మూడో వన్డేలో 352 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో జాంగూ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ షాయ్ హోప్‌తో కలిసి జట్టు గెలుపుకు పటిష్ఠమైన పునాది వేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో జాంగూ కేవలం 47 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సిరీస్‌లో భారత్ గెలిచినా, విండీస్ ప్లేయర్లు ప్రదర్శించిన పోరాటపటిమ అందరినీ ఆకట్టుకుంది.
ఇవి కూడా చదవండి:
తక్షణమే కరువు మండలాలు ప్రకటించాలి: కవిత డిమాండ్
ఉక్రెయిన్‌లో భారతీయ ఫార్మా ప్లాంట్‌పై డ్రోన్ దాడి.. ఒకరి మృతి
స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయి: మంత్రి నారాయణ