Share News

రాయ్ బరేలీలో పోటీకి రాహుల్ భయపడ్డారు: ఎంపీ శివ్ పాల్ సింగ్

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:10 AM

కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి పోటీచేయడానికి భయపడ్డారని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ శివ్ పాల్ సింగ్ అన్నారు. ఒక దశలో ఆ సీటును వదులుకోవడానికి కూడా రాహుల్ సిద్ధపడ్డారని చెప్పారు. తమ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ హామీ ఇవ్వడంతోనే రాహుల్ ఆ సీటు నుంచి బరిలోకి దిగారని వెల్లడించారు.

రాయ్ బరేలీలో పోటీకి రాహుల్ భయపడ్డారు: ఎంపీ శివ్ పాల్ సింగ్

ఇంటర్‌నెట్ డెస్క్: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి పోటీచేయడానికి భయపడ్డారని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ శివ్ పాల్ సింగ్ అన్నారు. ఒక దశలో ఆ సీటును వదులుకోవడానికి కూడా రాహుల్ సిద్ధపడ్డారని చెప్పారు. తమ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ హామీ ఇవ్వడంతోనే రాహుల్ ఆ సీటు నుంచి బరిలోకి దిగారని వెల్లడించారు. ఓ వార్తా సంస్థతో శివ్ పాల్ మాట్లాడారు.


‘‘2024 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు లేకుంటే, యూపీలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలిచి ఉండేది కాదు. ఆ టైంలో కాంగ్రెస్ ఎంత నిరాశలో ఉందంటే, ఆ పార్టీ లీడర్ రాహుల్.. రాయ్ బరేలీ నుంచి పోటీచేయడానికి ముందుకు రాలేదు. ఆ సీటును వదులుకోవడానికి కూడా ఆయన సిద్ధపడ్డారు. కానీ, మా పార్టీ అధినేత అఖిలేశ్.. రాహుల్‌‌కు ధైర్యం చెప్పారు. ఆ సీటు నుంచి రాహుల్ పోటీ చేయకపోతే ఎస్పీ తరపున అభ్యర్థిని నిలబెడతామని చెప్పారు. దీంతో రాహుల్ గాంధీ.. రాయ్‌బరేలీ నుంచి పోటీ చేశారు. లేకపోతే ఆ స్థానం నుంచి రాహుల్ పోటీచేసే వారు కాదు’’ అని శివ్ పాల్ చెప్పారు.


మా అధినేతే వల్లే గెలిచారు..

రాయ్‌బరేలీలో రాహుల్ విజయం సాధించడానికి తమ అధినేత అఖిలేశ్ యాదవే కారణమని శివ్ పాల్ సింగ్ అన్నారు. తమతో కాంగ్రెస్ కుదుర్చుకున్న పొత్తులో భాగంగా రాయ్‌బరేలీ సీటు కాంగ్రెస్‌కు పోయిందని, దీంతో సమాజ్‌వాదీ పార్టీ ఓటర్లు రాహుల్‌కు ఓటు వేశారని ఆయన పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో తాము 37 సీట్లు పొంది కాంగ్రెస్ కన్నా ముందున్నామని చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

మిడ్‌టర్మ్ ఎన్నికలు.. వృద్ధులకు ట్రంప్ బంపర్ ఆఫర్

కో-పైలట్ నాపై వెనుక నుంచి అటాక్ చేశాడు: పైలట్ మచ్చార్

Updated Date - Oct 04 , 2026 | 01:57 PM