కో-పైలట్‌ను వదిలిపెట్టాలన్న ఫ్లైదుబాయ్ సిబ్బంది?
ABN , Publish Date - Oct 04 , 2026 | 01:08 PM
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై దాడి చేసిన ఒమనీ కోపైలట్ హమామ్ అల్ హమామీని ప్రయాణికులు పట్టుకున్న తర్వాత వారికి, విమాన సిబ్బందికి మధ్య కాసేపు వాగ్వాదం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.
ఇంటర్‌నెట్ డెస్క్: దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై దాడి చేసిన ఒమనీ కోపైలట్ హమామ్ అల్ హమామీని ప్రయాణికులు పట్టుకున్న తర్వాత వారికి, విమాన సిబ్బందికి మధ్య కాసేపు వాగ్వాదం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇజ్రాయెల్ వార్తా చానెల్ ఐ24 న్యూస్ ఆ వీడియోను విడుదల చేసింది.
ఆ వీడియోలో హమానీని ప్రయాణికులు అతని చేతులు కట్టేసి ఉంచారు. అతనిని పట్టుకున్న తర్వాత వదిలివేయాలని ఫ్లై దుబాయ్ విమాన సిబ్బంది పట్టుబట్టగా.. అతనిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని, అతనిని పోలీసు అప్పగించడం ఒక్కటే మార్గమని ప్రయాణికులు చెబుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. ‘‘టెర్రరిస్టు హమానీని పట్టుకుని గంట గడిచింది. ఇప్పుడు 40 నిమిషాలు, ఇంకా 5 నిమిషాలైతే అతనిని పోలీసులకు అప్పగించవచ్చు’’ అని విమాన ప్యాసింజర్లు సిబ్బందితో పేర్కొన్నట్లు ఆ వీడియోలో ఉంది. వాస్తవానికి హమానీని పట్టుకున్న తర్వాత అతనిని వదిలివేయాల్సిందిగా ఫ్లైదుబాయ్ సిబ్బంది తమను కోరారని, అతని చేతులకు కట్టిన కట్లు విప్పేయాలని డిమాండ్ చేశారని హమానీని పట్టుకున్న ఇద్దరు ప్యాసింజర్లు ‘ద న్యూయార్క్ పోస్ట్’ కు తెలిపారు.
మాకేం చేయాలో తోచలేదు
హమానీని వదలివేయాలని సిబ్బంది చెప్పడంతో తమకు ఏం చేయాలో తోచలేదని, అతనిని పోలీసులకు అప్పగించడం తప్ప వేరే మార్గం తమకు కనిపించలేదని జ్వికా మేన్స్, డానియెల్ ష్లిచర్ అనే ప్రయాణికులు తెలిపారు. ‘ద న్యూయార్క్ పోస్ట్’ కు వారు ఇంటర్వ్యూ ఇచ్చారు. హమానీని వదిలివేయాలని కోరడంతో ఆ సిబ్బందిపై తమకు వెంటనే అనుమానం వచ్చిందని చెప్పారు. దీంతో తమకు, సిబ్బందికి మధ్య కాసేపు వాగ్వాదం జరిగిందన్నారు. ‘‘హమానీని మేము చంపడం లేదు. అతడే మమ్మల్ని చంపకుండా ఉంటే చాలు. అతని బారి నుంచి మమ్మల్ని మేము కాపాడుకుంటే చాలు’’ అని విమాన సిబ్బందికి చెప్పామన్నారు. మచ్చార్‌పై దాడిలో సిబ్బంది హస్తం ఉందా అని అనుమానం కలిగిందన్నారు. దాంతో తాము చెప్పినట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించామని తెలిపారు.
హమానీని బంధించింది వీరే..
టలి మేన్స్ అనే ప్యాసింజర్ కూతురు టాయిలెట్‌కు వెళ్లింది. బయట ఆమె తల్లి ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే ఫ్లైట్ డెక్ నుంచి ఆమెకు అరుపులు వినిపించాయి. దీంతో బ్యాకప్ పైలట్‌కు ఆమె సమాచారం ఇచ్చారు. మచ్చార్ తలుపు తీయగా లోపల ఆయనపై కోపైలట్ గొడ్డలితో దాడిచేసినట్లు తెలిసింది. వెంటనే ప్రయాణికులు యానివ్ హయూన్, జ్వికా మేన్స్, షోటా ముసేవ్, డానియెల్ ష్లిచర్ అక్కడికి చేరుకున్నారు. ముందుగా కోపైలట్‌ను యానివ్ పట్టుకోగా తర్వాత మిగతా ప్యాసింజర్లు పట్టుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
మిడ్‌టర్మ్ ఎన్నికలు.. వృద్ధులకు ట్రంప్ బంపర్ ఆఫర్
కో-పైలట్ నాపై వెనుక నుంచి అటాక్ చేశాడు: పైలట్ మచ్చార్