Share News

ఉక్రెయిన్‌లో భారతీయ ఫార్మా ప్లాంట్‌పై డ్రోన్ దాడి.. ఒకరి మృతి

ABN , Publish Date - Oct 04 , 2026 | 01:26 PM

ఉక్రెయిన్‌లో ఓ భారతీయ ఫార్మా కంపెనీపై తాజాగా డ్రోన్ దాడి జరిగింది. సుమీ ప్రాంతంలో కుసుమ్ గ్రూప్‌ నిర్వహిస్తున్న ఈ ప్లాంట్‌పై దాడి జరిగినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఉక్రెయిన్‌లో భారతీయ ఫార్మా ప్లాంట్‌పై డ్రోన్ దాడి.. ఒకరి మృతి
Drone Strike on Indian Pharama Company

ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌లో ఓ భారతీయ ఫార్మా కంపెనీపై తాజాగా డ్రోన్ దాడి జరిగింది. సుమీ ప్రాంతంలో కుసుమ్ గ్రూప్‌ నిర్వహిస్తున్న ఈ ప్లాంట్‌పై దాడి జరిగినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డ్రోన్ దాడి జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగలు వెలువడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఫ్యాక్టరీలోని ప్రధాన నిర్మాణం పూర్తిస్థాయిలో దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. దాదాపు రూ.400 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు సమాచారం.


1994లో కుసుమ్ గ్రూపు తన కార్యకలాపాలు ప్రారంభించింది. మొదట్లో భారత్ నుంచి ఉక్రెయిన్‌కు ఔషధాలను ఎగుమతి చేసేంది. 2002లో ఔషధ తయారీ వైపు మళ్లింది. సొంతంగా జెనరిక్ ఔషధాలను తయారు చేసి విక్రయించడం ప్రారంభించింది. 2007లో భారత్‌లో ప్లాంట్‌ను, 2009లో సుమీ ప్రాంతంలో మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఆ తరువాత భారత్‌లో మరో రెండు కర్మాగారాలు ప్రారంభమయ్యాయి. ఉక్రెయిన్, ఉజ్బెకిస్థాన్, కజకస్థాన్ సహా మొత్తం 9 దేశాల్లో కుసుమ్ గ్రూపు ప్రస్తుతం 50 రకాల జెనరిక్ ఔషధాలను విక్రయిస్తోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం పతాకస్థాయిలో ఉన్న కాలంలోనూ అక్కడి ప్లాంట్‌లో కార్యకలాపాలు కొనసాగాయి.


ఈ వార్తలనూ చదవండి:

పెరిగిన అద్దెలు.. ఇళ్ల కొరత.. స్పెయిన్‌లో లక్షలాది మంది నిరసన

ఫ్లైదుబాయ్ ఉదంతం.. విమానంలోని ఆ ఇద్దరూ ఎవరు?

Updated Date - Oct 04 , 2026 | 01:44 PM