Share News

ప్రతిష్ఠాత్మక క్లబ్‌లో చేరిన శుభ్‌మన్ గిల్..

ABN , Publish Date - Oct 04 , 2026 | 04:57 PM

మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ విఫ‌ల‌మైన‌ప్ప‌టికి తొలి రెండు మ్యాచ్‌లలో వరుసగా సెంచరీ, డబుల్ సెంచరీలతో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచుల్లో కలిపి మొత్తం 334 పరుగులు సాధించాడు.

ప్రతిష్ఠాత్మక క్లబ్‌లో చేరిన శుభ్‌మన్ గిల్..
Shubman Gill

వెస్టిండీస్‌తో మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా కేవసం చేసుకుంది. ముల్లాన్‌పూర్ వేదిక‌గా జ‌రిగిన మూడో వ‌న్డేలో గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాల‌ని భావించిన భార‌త్‌కు కరేబియన్ జట్టు షాకిచ్చింది. 352 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని చేధించి క్లీన్ స్వీప్ నుంచి విండీస్ జ‌ట్టు త‌ప్పించుకుంది. ఈ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించింది. చివరి మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయినప్పటికీ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు మాత్రం కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌(Shubman Gill Player of the Series)కే దక్కింది.


మూడో వన్డేలో గిల్ విఫ‌ల‌మైన‌ప్ప‌టికి తొలి రెండు మ్యాచ్‌లలో వరుసగా సెంచరీ, డబుల్ సెంచరీలతో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచుల్లో కలిపి మొత్తం 334 పరుగులు సాధించాడు.ఈ క్రమంలోనే గిల్ ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకున్న మూడో ఆటగాడిగా దిగ్గజాలు యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ, సౌరవ్ గంగూలీ సరసన నిలిచాడు. ఇప్పటి వరకు గిల్ ఏడు సార్లు ప్లేయర్ ఆఫ్ ది అవార్డులను సొంతం చేసుకున్నాడు.


యువీ, ధోనీ, గంగూలీలు కూడా ఏడేసి సార్లు ఈ అవార్డును గెలుచుకోగా, గిల్ కేవలం 70 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించడం విశేషం. అతడి అవార్డులన్నీ 2022 తర్వాత రావడం గమనార్హం. త్వరలో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో గిల్ రాణిస్తే, వీరి రికార్డును అధిగమించి రెండో స్థానంలోకి వెళ్లే అవకాశముంది. సచిన్ టెండూల్కర్ 15 అవార్డులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా... విరాట్ కోహ్లీ 11 అవార్డులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.


ఇవి కూడా చదవండి:

నా ఇన్నింగ్స్ క్రెడిట్ ధోనికే దక్కుతుంది: విండీస్ కెప్టెన్ హోప్

పాక్ హనీట్రాప్‌లో భారత నేవీ ఉద్యోగి.. రక్షణ రహస్యాల లీక్ ఆరోపణలపై అరెస్ట్

అయోధ్య రామాలయం చందా చోరీ కేసు.. దర్యాప్తును త్వరగా ముగించేందుకు ఎందుకంత తొందర?

Updated Date - Oct 04 , 2026 | 05:12 PM