నా ఇన్నింగ్స్ క్రెడిట్ ధోనికే దక్కుతుంది: విండీస్ కెప్టెన్ హోప్
ABN , Publish Date - Oct 04 , 2026 | 04:47 PM
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే మూడో వన్డేలో విండీస్ కెప్టెన్ షై హోప్ అద్భుత ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో తన విధ్వంసకర బ్యాటింగ్ వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే మూడో వన్డేలో విండీస్ అద్భుత ప్రదర్శనతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ షై హోప్ 143 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 162 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ క్రమంలో తన విధ్వంసకర బ్యాటింగ్ వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించాడు. టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనితో గతంలో మాట్లాడిన క్షణాలను గుర్తు చేసుకున్నాడు.
‘ఎంఎస్ ధోని అద్భుతమైన వ్యక్తి. గతంలో అతడితో నాకు మంచి సంభాషణ జరిగింది. అప్పుడు మాట్లాడిన విషయాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. మనం అనుకునే దాని కంటే బ్యాటర్‌కు ఎప్పుడూ ఎక్కువ సమయం ఉంటుందని ఆయన చెప్పారు. కాబట్టి ఫలితంపై ఎక్కువగా దృష్టి పెట్టకుండా.. ప్రక్రియను నమ్మాలని సూచించారు. ఆటను సాధ్యమైనంత వరకు చిన్న భాగాలుగా విడదీసి అర్థం చేసుకోవాలని, ఇన్నింగ్స్ చివరి దశలో బౌండరీలు సాధించడానికి మార్గాలు వెతుక్కోవాలని చెప్పారు. భారత్‌పై మూడో వన్డేలో అదే అమలు చేశా. లక్ష్యం గురించి ఆందోళన పడకుండా.. బౌండరీల మీదే ఫోకస్ పెట్టా. ఈ ఇన్నింగ్స్ క్రెడిట్ ధోనికే దక్కుతుంది’ అని హోప్ వెల్లడించాడు.
దాని గురించి అంచనా వేశా..
‘భారత జట్టు అప్పటికే కొన్ని ఓవర్లు వెనుకబడి ఉందని ఆలోచించా. దీంతో చివరి దశలో ఒక ఫీల్డర్‌ను సర్కిల్‌లోకి తీసుకురావాల్సి ఉంటుందని తెలుసు. భారీ స్కోరును కాపాడుకోవాల్సిన సమయంలో ఐదుగురు ఫీల్డర్లు సర్కిల్‌లో ఉండటం ఎప్పుడూ కష్టమే. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని బ్యాటింగ్ చేశా. ఫలితం అనుకూలంగా వచ్చింది’ అని హోప్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
వయసు కంటే ఎక్కువ వన్డే సెంచరీలు ఉండాలి.. రోహిత్‌కు గావస్కర్ టార్గెట్
షో చేయడానికే పనికొస్తారు.. వైభవ్‌కు ఆయూబ్ సెండాఫ్‌పై పాక్ మాజీ క్రికెటర్ ఫైర్