పెళ్లికి రావాలని ఆన్‌లైన్‌లో ఆహ్వానం.. కార్లు గిఫ్ట్‌గా ఇచ్చిన అతిథులు
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:44 PM
తన పెళ్లికి హాజరు కావాలని పరిచయం లేనివారిని ఆన్‌లైన్‌లో ఆహ్వానించిన ఓ చైనా యువకుడికి ఊహించని బహుమతులు వచ్చాయి. అతని పెళ్లికి హాజరైన వారు వివిధ బహుమతులతో పాటు కార్లు కూడా గిఫ్టుగా ఇచ్చారు. వాటిలో ఒక బెంజ్ కారు కూడా ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: తన పెళ్లికి హాజరు కావాలని పరిచయం లేనివారిని ఆన్‌లైన్‌లో ఆహ్వానించిన ఓ చైనా యువకుడికి ఊహించని బహుమతులు వచ్చాయి. అతని పెళ్లికి హాజరైన వారు వివిధ బహుమతులతో పాటు కార్లు కూడా గిఫ్టుగా ఇచ్చారు. వాటిలో ఒక బెంజ్ కారు కూడా ఉంది. తన పెళ్లికి సంబంధించిన కథను ఆన్‌లైన్ వీడియోలో ఆ యువకుడు వివరించాడు. తన చిన్నతనంలోనే తన తండ్రి చనిపోయాడని, తల్లి మరో వ్యక్తిని వివాహం చేసుకుందని చెప్పాడు. దాంతో తాను, తన అన్న బతుకుదెరువు కోసం ఎన్నో కష్టాలు పడ్డామని తెలిపాడు. ‘నేను చాలా కష్టపడి కొంత సొమ్ము దాచి ఉంచాను. నేను ప్రేమించిన అమ్మాయిని వివాహనం చేసుకోవడానికి ఆ సొమ్ము దాచాను. అయితే, మాకు బంధువులు చాలా తక్కువ మంది ఉన్నారు. అంత తక్కువ మంది బంధువులు హాజరైతే మా పెళ్లిలో సందడి ఉండదు. మీరు కూడా రండి’ అంటూ అపరిచితులను ఆన్‌లైన్‌లో అతను ఆహ్వానించాడు.
వస్తున్నాం బ్రో అంటూ నెటిజన్ల రిప్లై
అతని వీడియో వైరల్‌గా మారింది. ‘నీ పెళ్లికి వస్తున్నాం బ్రో’ అంటూ చాలా మంది నెటిజన్లు స్పందించారు. వారంతా ఊరికే అతని వివాహానికి హాజరుకాలేదు. తమ వెంట ఖరీదైన బహుమతులు తీసుకెళ్లారు. కొంతమంది కార్లు తీసుకెళ్లి గిఫ్టుగా ఇచ్చారు. వాటిలో ఒక బెంజ్ కారు కూడా ఉండడం విశేషం. ఎవరో అతిథి ఆ కారు గిఫ్టుగా ఇచ్చాడు. అలాగే, అతని పెళ్లిలో ఉచితంగా వంట చేయడానికి చెఫ్‌లు కూడా హాజరయ్యారు. చాలా మంది అతిథులు క్యాండిల్స్ తెచ్చి అతని ఇంటిని అలంకరించారు. దీంతో అతని పెళ్లి చాలా గ్రాండ్‌గా జరిగింది. జీవితంలో ఒక మరపురాని అనుభూతిని అతనికి మిగిల్చింది.
ఈ వార్తలనూ చదవండి:
ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?