Share News

యెమెన్‌లో సాంకేతిక సమస్యతో కూలిన హెలికాప్టర్‌.. ఇద్దరు పైలట్ల మృతి

ABN , Publish Date - Oct 18 , 2026 | 03:07 PM

సౌదీ అరేబియాకు చెందిన హెలికాప్టర్ కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు చనిపోయారు. టెక్నికల్ ఫాల్ట్ కారణంగా తమ హెలికాప్టర్ యెమెన్ సరిహద్దుల్లో కూలిపోయిందని హౌతీలపై పోరాడుతున్న సౌదీ నేతృత్వంలోని కూటమి ఆదివారం తెలిపింది. అయితే, ఆ హెలికాప్టర్‌ను తామే కూల్చివేశామని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు పేర్కొన్నారు.

యెమెన్‌లో సాంకేతిక సమస్యతో కూలిన హెలికాప్టర్‌.. ఇద్దరు పైలట్ల మృతి

ఇంటర్‌నెట్ డెస్క్: సౌదీ అరేబియాకు చెందిన హెలికాప్టర్ కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు చనిపోయారు. టెక్నికల్ ఫాల్ట్ కారణంగా తమ హెలికాప్టర్ యెమెన్ సరిహద్దుల్లో కూలిపోయిందని హౌతీలపై పోరాడుతున్న సౌదీ నేతృత్వంలోని కూటమి ఆదివారం తెలిపింది. అయితే, ఆ హెలికాప్టర్‌ను తామే కూల్చివేశామని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు పేర్కొన్నారు. రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీల గ్రూప్ దాడి చేయడంతో 13 మంది చనిపోయిన వారం రోజులకు సౌదీ హెలికాప్టర్ కూలిపోయింది. కూలిపోయిన హెలికాప్టర్‌ను సౌదీ అరేబియా నేషనల్ గార్డ్ మంత్రిత్వశాఖకు చెందిన ఏహెచ్-6ఐ రికనైసాన్స్ చాపర్‌గా గుర్తించారు. నజ్రాన్ ప్రాంతంలోని సౌదీ భూభాగంలో హెలికాప్టర్ కూలిపోయిందని హౌతీలపై పోరాడుతున్న సౌదీ నేతృత్వంలోని కూటమి ప్రతినిధి తుర్కి అల్ మల్కీ.. సౌదీ ప్రెస్ ఏజెన్సీకి వెల్లడించారు. టెక్నికల్ ఫాల్ట్ కారణంగానే హెలికాప్టర్ కూలిపోయిందని, అందులోని ఇద్దరు పైలట్లు అమరులయ్యారని అల్ మల్కీ చెప్పారు.


అయితే.. సౌదీ శత్రువుకు చెందిన ఒక అపాచీ హెలికాప్టర్‌ను తాము కూల్చివేశామని హౌతీ ప్రతినిధి యహ్యా సరీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా.. సౌదీ, హౌతీల మధ్య గత కొంతకాలంగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఇటీవలే సౌదీ అరేబియాకు చెందిన మౌలిక సౌకర్యాలు, ఎర్ర సముద్రంలోని ట్యాంకర్లతో పాటు రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో సౌదీ నేతృత్వంలోని కూటమి కూడా హౌతీల స్థావరాలపై ప్రతిదాడి చేసింది. శనివారం రాత్రి రియాద్ ప్రాంతంలో రెండు డ్రోన్లను అడ్డుకున్నామని, తూర్పు ప్రావిన్స్‌లో మూడో డ్రోన్‌ను అడ్డుకున్నామని కూటమి పేర్కొంది.


ఈ వార్తలనూ చదవండి:

ఒక్క రాత్రిలో అది సాధ్యం కాదు.. భారత్‌పై యూఎస్ మంత్రి వ్యాఖ్య

రణరంగంగా మారిన ఫ్రాన్స్..

Updated Date - Oct 18 , 2026 | 03:13 PM